Karimnagar Congress: ఎంపీ టికెట్‌ ఆయనకే పక్కానా?.. కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?

నామినేషన్లకు ఐదు రోజులే గడువున్నా అభ్యర్థి విషయంలో‌ క్లారిటీ కరువైంది. కరీంనగర్ కాంగ్రెస్ ‌అభ్యర్థిని ఇంకా అధికారికంగా‌ ప్రకటించలేదు. ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రతిపక్షాలు ప్రచారంలో దూకుడుగా వెళ్తుంటే అభ్యర్థి విషయంలో‌ అధికార పార్టీ‌ మాత్రం ఇంకా జాప్యం చేస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నీ తానై అభ్యర్థిని చూడకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

Karimnagar Congress: ఎంపీ టికెట్‌ ఆయనకే పక్కానా?.. కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
Karimnagar Congress
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 20, 2024 | 4:48 PM

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లకు ఐదు రోజులే గడువున్నా అభ్యర్థి విషయంలో‌ క్లారిటీ కరువైంది. కరీంనగర్ కాంగ్రెస్ ‌అభ్యర్థిని ఇంకా అధికారికంగా‌ ప్రకటించలేదు. ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రతిపక్షాలు ప్రచారంలో దూకుడుగా వెళ్తుంటే అభ్యర్థి విషయంలో‌ అధికార పార్టీ‌ మాత్రం ఇంకా జాప్యం చేస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నీ తానై అభ్యర్థిని చూడకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

ఖమ్మం విషయంలోనైనా ఫలానా ఆయన అభ్యర్థి అన్న ప్రచారమైనా జరుగుతోంది. కానీ.. కరీంనగర్‌ క్యాండేట్‌పై కనీసం లీకులు కూడా లేవు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ప్రకటనలో జరుగుతున్న జాప్యంతో పార్టీ కేడర్‌లో టెన్షన్‌ పెరిగిపోతోంది. అనధికారికంగా ఆయనే అభ్యర్థి అంటూ వెలిచాల రాజేందర్ రావు సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్‌పార్టీ. మంత్రి పొన్నంతో పాటు వెలిచాల ఈ మీటింగులలో పాల్గొంటున్నారు. అయితే ఆయనే అభ్యర్థి అని పార్టీ నాయకత్వం ఎక్కడా చెప్పడం లేదు. రాజేందర్ రావు కూడా కాంగ్రెస్ ‌పార్టీ అధికారికంగా ప్రకటించలేదని, ఎవరికి టికెటి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని చెబుతున్నారు. దీంతో క్యాడర్ ‌అభ్యర్థి విషయంలో అయోమయానికి గురవుతోంది.

అభ్యర్థి ఎవరో చెప్పకుండా ఓటర్ల దగ్గరికి ఎలా వెళతామని నేతలను ప్రశ్నిస్తున్నాయి కరీంనగర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు.ఇప్పటికే మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎక్కడా కాంగ్రెస్‌ పెద్దలు ఎంపీ అభ్యర్థి పేరు ప్రస్తావించడంలేదు. పార్టీని గెలిపించాలని మాత్రమే సమావేశాల్లో పిలుపు ఇస్తున్నారు. ఓపక్క ప్రధాన ప్రతిపక్షాలు రెండూ కరీంనగర్‌లో ప్రచార స్పీడ్ పెంచాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రచార రథాలు‌ సందడిగా తిరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రచారంలో ఎలాంటి హడావిడి కనబడకపోవడంతో అధికారంలో ఉండికూడా ఈ పరిస్థితి పార్టీ క్యాడర్‌కి మింగుడుపడటం లేదు.

పార్లమెంటు నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం చేయాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో ఎంత పరుగుపెట్టినా మూడువారాల్లో ప్రచారాన్ని ఎలా పూర్తి చేయగలమని కాంగ్రెస్‌ కేడర్‌లో చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మంత్రి పొన్న ప్రభాకరే ప్రచార బాధ్యతలు భుజానేకున్నారు. ఆయన‌ కూడా ఎక్కడా అభ్యర్థి పేరును ప్రస్తావించడం లేదు. అధిష్ఠానంనుంచి సంకేతాలున్నా అధికార ప్రకటన చేయక పోవడంతో వెలిచాల కూడా ప్రచారంలో స్పీడ్‌ పెంచలేకపోతున్నారు. నామినేషన్లు మొదలయ్యాక కూడా నాన్చుడు ధోరణితో నష్టం జరిగేలా ఉందని కలవరపడుతోంది కాంగ్రెస్‌ కేడర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…