Leopard Fear: కామారెడ్డిలో చిరుత పులి హల్‌చల్.. రహదారిపై కారుకు అడ్డంగా రావడంతో…
Leopard Fear: తెలంగాణను పులుల భయం వెంటాడుతూనే ఉంది. తరచూ ఏదో ఒక జిల్లాలో వాటి సంచారం కలకలం రేపుతోంది. ఓవైపు వారం రోజుల నుంచి వెతుకుతున్నా..
Leopard Fear: తెలంగాణను పులుల భయం వెంటాడుతూనే ఉంది. తరచూ ఏదో ఒక జిల్లాలో వాటి సంచారం కలకలం రేపుతోంది. ఓవైపు వారం రోజుల నుంచి వెతుకుతున్నా.. కుమ్రంభీం అడవుల్లో పెద్దపులి జాడ దొరకలేదు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో చిరుత హల్‌చల్ చేసింది. తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ శివారులో చిరుత పులి సంచరించింది. దారిలో ఓ కారుకు అడ్డురావడంతో వాహనదారుడు హడలిపోయాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. చిరుత సంచరిస్తోందని, జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు.
కాగా, గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు చిరుత సంచారానికి సంబంధించి విషయాన్ని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. పాదముద్రల ఆధారంగా చిరుత కదలికలను గమనించారు. కన్కల్ నుంచి కరడ్ పల్లి వైపు చిరుత పులి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. చిరుత పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. చిరుతను బందించాల్సిందిగా అటవీ అధికారులను వేడుకుంటున్నారు. ఇదిలాఉంటే.. చిరుత పులిని బందించేందుకు అధికారులు బోనును ఏర్పాటు చేశారు.
Also read:
India Corona Cases: దేశంలో కొత్తగా 10,064 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Priyamani: లాక్‌డౌన్ సమయం దేవుడిచ్చిన వరంలా అనిపించింది.. గత సంవత్సర మధుర స్మృతులను తలుచుకుంటున్న..