BJP: తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్.. అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ..

కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నాక సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‎పై ఢిల్లీలో వర్క్ షాప్ జరిగింది.

BJP: తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్.. అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ..
Telangana Bjp
Follow us
Vidyasagar Gunti

| Edited By: Srikar T

Updated on: Aug 20, 2024 | 5:30 PM

కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నాక సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‎పై ఢిల్లీలో వర్క్ షాప్ జరిగింది. సభ్యత్వ నమోదుపై ట్రైనింగ్ ఇచ్చారు. సభ్యత్వ నమోదు విధివిధానాలు పార్టీ నాయకత్వం ప్రకటించింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరగబోతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి తెలంగాణలో 12 మందితో ఓ కమిటీనీ కూడా నియమించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. తెలంగాణలో మెంబర్ షిప్ డ్రైవ్‎ను పెద్ద ఎత్తున నిర్వహించి సంస్థాగత కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బుధవారం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‎లో జరిగే వర్క్ షాప్‎లో ప్రతి జిల్లాకు మెంబర్ షిప్‎కి సంబంధించి ఒక ప్రముఖ్, ఇద్దరు సహ ప్రముఖులను పార్టీ నియమించనుంది.

మెంబర్ షిప్ డ్రైవ్‎లో ఫస్ట్ పేజ్‎ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 25 వరకు మొదటి విడత, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు రెండో విడత సభ్యత్వ నమోదు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక క్రియాశీల సభ్యత్వం నమోదును అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు ఉండే ఛాన్స్ ఉంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వం రిజిస్టర్ తయారీ చేస్తారు. ఈ సారి తెలంగాణలో దాదాపు 50 లక్షల సభ్యత్వం టార్గెట్‎గా బీజేపీ ముందుకు వెళ్తోంది. మెంబర్ షిప్ డ్రైవ్ తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కింది స్థాయి నుంచి పార్టీ అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. బుత్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక మొదట జరుగుతుంది. తర్వాత మండల కమిటీ, జిల్లా కమిటీ అధ్యక్షుల ఎన్నిక వరస క్రమంలో నిర్వహిస్తారు. ఆపై రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక డిసెంబర్‎లో జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక పూర్తయితే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నేరుగానే అధ్యక్షుల ఎంపిక చేస్తున్న కమల అధినాయకత్వం.. మిగిలిన రాష్ట్రాలకు తొందరపడకుండా ఎన్నిక ప్రక్రియ ద్వారానే అధ్యక్షుల ఎంపిక పూర్తే చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి రెండోసారి కేంద్రమంత్రి కావడంతో ఆయన ప్లేస్‎లో కొత్త అధ్యక్షుడు వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురి పేర్లు కూడా రేసులో ముందున్నాయని. మరికొంత మంది పేర్లు కన్ఫర్మ్ అయ్యాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అవే పేర్లతో సంస్థాగత ఎన్నికల్లోనే కొత్త అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని పార్టీనేతలు అంటున్నారు. ప్రస్తుతం మెంబర్ షిప్ డ్రైవ్‎తో బిజీ షెడ్యూల్‎లోకి బీజేపీ వెళ్లబోతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!