సెల్‌ఫోన్ లొకేషన్ అధారంగా మృతదేహాన్ని గుర్తింపు.. అసలు ఏం జరిగిందంటే..
నల్లగొండలో బెట్టింగ్ భూతానికి యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోగా, రెండు రోజుల తర్వాత మృతదేహం లభించింది.
నల్లగొండలో బెట్టింగ్ భూతానికి యువకుడు బలి అయ్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోగా, రెండు రోజుల తర్వాత మృతదేహం లభించింది. నల్లగొండ పట్టణానికి చెందిన తడకమళ్ల సోమయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తుండగా.. ఆయన కుమారులు సాయికుమార్(28), సంతోష్ వ్యాపారంలో సహకరించేవారు. సోమయ్య పెద్ద కొడుకు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ చేస్తూ సాయికుమార్ సుమారు రూ.2కోట్ల అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఇన్నాళ్లు చేసిన అప్పులు ఇంట్లో తెలియకుండా సాయికుమార్ మేనేజ్ చేశాడు. కానీ అప్పుల వాళ్లు ఇటీవల ఇంటి వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ గొడవ చేశారు. దీంతో సాయికుమార్ ఆగస్ట్ 14న బయటకు వెళ్లిన సాయికుమార్ ఇంటికి తిరిగి రాలేదు.
బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లేకపోవడంతో సాయి కుమార్ కుటుంబ సభ్యులు ఈ నెల 17న నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం సాయికుమార్ రెండు కోట్లకుపైగా అప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బెట్టింగ్ కోసం చేసిన అప్పుల వల్లే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట సాయికుమార్ మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హాలియా చెక్‌పోస్టు వద్ద ఉన్న 14వ మైలురాయి సమీపంలో సాయికుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు.
అయితే సాగర్ ఎడమకాల్వ వద్ద బైక్, సెల్‌ఫోన్ ఉంచి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల తర్వాత సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ సమీపంలోని సాగర్ ఎడమకాల్వలో మృతదేహం తేలటంతో సాయికుమార్ డెడ్ బాడీగా గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. సాయికుమార్ మృతికి బెట్టింగ్ అప్పుల కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడి అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాన్ని మాత్రం యువకులు మానడం లేదని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..