AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో అఘోరీ నాగసాధువు హల్‌చల్.. ఏకంగా కత్తితో..!

అఘోరాలైనా..అఘోరీలైనా..ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ..ఎప్పుడూ లేనంతగా న్సూసెన్స్‌ క్రియెట్‌ చేస్తోంది. నడిరోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు..ఇటు జనానికి, అటు పోలీసులను చికాకు తెప్పిస్తున్నాయి ఇటీవల ఆమెపై కేసు కూడా నమోదైంది..

Telangana: కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో అఘోరీ నాగసాధువు హల్‌చల్.. ఏకంగా కత్తితో..!
Aghori Nagasadhu
P Shivteja
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 28, 2025 | 7:45 PM

Share

లేడీ అఘోరీ మరోసారి హల్చల్ చేసింది. ఆలయ రాజగోపురం నుండి ప్రధాన ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులను కోరింది. అందుకు ఆలయ సిబ్బంది నిరాకరించడంతో హంగామా సృష్టించింది. ఏకంగా తన దగ్గర ఉన్న కత్తితో ఆలయం వద్ద ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఆ ఘటనతో అక్కడ ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అఘోరీ నాగసాధువు హల్‌చల్ చేసింది. మంగళవారం(జనవరి 28) ఉదయం ఆలయ రాజగోపురం నుండి ప్రధాన ద్వారం ద్వారా స్వామి వారి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులను కోరింది. అయితే బట్టలు వేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని, లేదంటే దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు తేల్చి చెప్పారు. ఆ కోపంతో తిరిగి కారులో కూర్చొని బయటకు రాకపోవడంతో ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే లేడీ అఘోరీని దుస్తులు వేసుకోవాలని కోరారు. ఈ సమయంలో ఆలయ రాజగోపురం వద్ద భక్తులు అఘోరీని చూసేందుకు భారీగా భక్తులు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ కోపంతో తన కారులో ఉన్న కత్తితో పలువురు భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది నాగ సాధువు. అనంతరం ఆలయ అధికారులు నచ్చచెప్పడంతో బట్టలు వేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని కొమురవెళ్లి నుండి వెళ్ళిపోయింది. దీంతో ఆలయ అధికారులు ఉపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో