టీకాంగ్రెస్‌కి షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఉత్తమ్‌కి రాజీనామా లేఖ, అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. గడిచిన ఎన్నికల్లో కూడా కుత్బుల్లాపూర్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున..

  • Venkata Narayana
  • Publish Date - 11:51 am, Sun, 21 February 21
టీకాంగ్రెస్‌కి షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఉత్తమ్‌కి రాజీనామా లేఖ, అనుచరులతో కలిసి ఢిల్లీకి పయనం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. గడిచిన ఎన్నికల్లో కూడా కుత్బుల్లాపూర్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖ పంపిన కూన.. ప్రస్తుతం అనుచరులతో కలిసి ఢిల్లీ బయలుదేరారు. బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే శేరిలింగంపల్లి భిక్షపతి యాదవ్‌ కుటుంబం బీజేపీకి గూటికి చేరింది. తాజాగా కూన శ్రీశైలం గౌడ్ కూడా పార్టీ వీడడం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఇబ్బందికరమే అంటున్నారు కేడర్‌.

Read also :

ఆమె నుదిటి బొట్టు టాక్ ఆఫ్ ద వరల్డ్, భారత సంతతి నాసా సైంటిస్ట్ స్వాతి మోహన్ చూపు.. శైలి అన్నీ సూపర్ అట్రాక్షన్

లాయర్ దంపతుల హత్య నేపథ్యం : గుంజపడుగు బయల్దేరిన బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు, దగ్గరుండి పంపించిన రాజాసింగ్