KTR Strategy: తెలంగాణలో మినీ మునిసిపోల్స్… కేటీఆర్ సరికొత్త వ్యూహంతో రెడీ

కార్పొరేషన్లలో ఒక్కో డివిజన్‌ ఒక్కో ముఖ్యనేతను, పురపాలికల్లో ప్రతి మూడు, నాలుగు వార్డులకు ఓ ముఖ్య నాయకుడు ప్రచార బాధ్యతలు చేపడతారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నేతలకే బాధ్యతలు అప్పగించారు వర్కింగ్ ప్రెసిడెంట్.

KTR Strategy: తెలంగాణలో మినీ మునిసిపోల్స్… కేటీఆర్ సరికొత్త వ్యూహంతో రెడీ
Telangana Bhavan
Follow us

|

Updated on: Apr 18, 2021 | 6:08 PM

KTR strategy for Telangana mini municipolls: తెలంగాణ (TELANGANA)లో కొనసాగుతున్న మినీ మునిసిపల్ ఎన్నికల (MINI MUNICIPAL POLLS) కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (K TARAKA RAMARAO) ప్రత్యేక వ్యూహంతో రెడీ అయ్యారు. రాష్ట్రంలో రెండు మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు అయిదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటితో (ఏప్రిల్ 18) నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించి, మే మూడో తేదీన ఓట్ల లెక్కిపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. కాగా.. ఈ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ (TRS_ పార్టీ పటిష్ట వ్యూహం రచించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి (CHIEF MINISTER) కే.చంద్రశేఖర్ రావు (K CHANDRA SHEKHAR RAO) ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్ నేతలకు ఈ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. వీరంతా పార్టీ వర్గాలతో కలిసి పని చేయాల్సి వుంటుంది. ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, నేతల సమన్వయం బాధ్యతలను వీరికి అప్పగించారు కేటీఆర్. ఈ మినీ మునిసిపల్ ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జిగా కేటీ రామారావు (KT RAMARAO) వ్యవహరిస్తుండగా.. స్థానిక నేతలు పర్యవేక్షించనున్నారు. ఆదివారం (ఏప్రిల్ 8) నుంచే పూర్తి స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధిష్ఠానం నిర్దేశించింది. వరంగల్ (WARANGAL)‌, ఖమ్మం (KHAMMAM) నగర పాలక సంస్థలతో పాటు సిద్దిపేట (SIDDIPET), అచ్చంపేట (ACHCHAMPET), నకిరేకల్ (NAKIREKAL)‌, జడ్చర్ల (JADCHARLA), కొత్తూరు (KOTTUR) పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వార్డులకు ఉపఎన్నికలను నిర్వహించనున్నారు.

స్థానిక ఎన్నికలైనందున ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలోనే పార్టీ వర్గాలు పనిచేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. వరంగల్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు.., ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, సిద్దిపేటకు మంత్రి హరీశ్‌రావు, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, అచ్చంపేటకు మంత్రి నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డిలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.  కార్పొరేషన్లలో ఒక్కో డివిజన్‌ ఒక్కో ముఖ్యనేతను, పురపాలికల్లో ప్రతి మూడు, నాలుగు వార్డులకు ఓ ముఖ్య నాయకుడు ప్రచార బాధ్యతలు చేపడతారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నేతలకే బాధ్యతలు అప్పగించారు వర్కింగ్ ప్రెసిడెంట్. పార్టీ వ్యూహానికి అనుగుణంగా అన్ని విధాల అర్హులకు, బలమైన వారికే టికెట్లు ఇవ్వాలని సూచించింది. మినీ పోరు ప్రచారానికి మరో 10 రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలని గులాబీ పార్టీ అధినేత ఆదేశించారు. వరంగల్‌, ఖమ్మంలలో రెండేసి రోజులు కేటీఆర్‌ రోడ్‌షో (KTR ROAD SHOW)లు నిర్వహించనున్నట్లు తెలిసింది. మిగిలిన పురపాలికల్లోనూ ఆయన పర్యటించే వీలుంది.

ALSO READ: కర్నాటక ముఖ్యమంత్రిని కల్వనున్న కేసీఆర్.. రాజోలిబండ సమస్యపై సీఎం ఫోకస్

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో