AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కరోనా ఎఫెక్ట్… భద్రాద్రి రామాలయంలో జరిగే అన్ని పూజల సేవలు రద్ధు..

రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తుంది. దీంతో పలు ఆలయాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తుండగా... మరికొన్ని దేవాయాలు మూసివేస్తున్నారు.

Corona Virus: కరోనా ఎఫెక్ట్... భద్రాద్రి రామాలయంలో జరిగే అన్ని పూజల సేవలు రద్ధు..
శ్రీ రాముని కళ్యాణం నిర్వహించిన అనంతరం గుడిలోనే రామచరితమానస్, రామాయణం, రామస్తుతి, రామ రక్ష స్తోత్రం వంటివి చదువుతారు
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2021 | 10:12 PM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తుంది. దీంతో పలు ఆలయాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తుండగా… మరికొన్ని దేవాయాలు మూసివేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీరాముడి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ నుంచి 30 వరకు అంతరాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు చేస్తున్నట్లు రామాలయం ఈవో శివాజీ ప్రకటించారు.

అలాగే ఏప్రిల్ 21, 22 తేదీలలో జరుగు శ్రీ రామనవమి వేడుకలకు భక్తులకు ఆలయ దర్శనములు, పూజలు, అన్నదాన వితరణ కూడా రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.ఇక దేశంలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,093 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఒక్క రోజు 4,443 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు 5 వేల మార్క్‌ను దాటాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,51,424 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 1,555 మంది కరోనాను జయించగా.. 15 మంది కరోనా ప్రభావంతో మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,12,563 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,824 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. అదే సమయంలో రికవరీ రేటు 88.94శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టీవ్ కేసులు ఉండగా.. వీరిలో 24,156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,17,37,753 మంది నుంచి సాంపిల్స్ సేకరించగా.. శనివారం ఒక్కరోజు 1,29,637 మంది నుంచి సాంపిల్స్ సేకరించారు.

ఇక ఆంద్రప్రదేశ్‏లో గడిచిన 24 గంటల్లో 35,922 పరీక్షలు నిర్వహించగా… 6,582 నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,62,037 మంది వైరస్ భారిన పడినట్లు రాష్టర వైద్య రోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున, కర్నూల్‏లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్ధరేసి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.

Also Read: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..