Petrol Diesel Price Today: పెరుగుతోన్న ధ‌ర‌ల నుంచి కాస్త ఊర‌ట‌.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఒకానొక స‌మ‌యంలో ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోయాయి. పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గ‌డం లేద‌న్నంటూ జెట్ వేగంతో దూసుకెళ్లాయి. అయితే...

Petrol Diesel Price Today: పెరుగుతోన్న ధ‌ర‌ల నుంచి కాస్త ఊర‌ట‌.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..
Petrol Diesel
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 19, 2021 | 6:46 AM

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఒకానొక స‌మ‌యంలో ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోయాయి. పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గ‌డం లేద‌న్నంటూ జెట్ వేగంతో దూసుకెళ్లాయి. అయితే గ‌త కొన్ని రోజులుగా మాత్రం పెరుగుద‌ల‌కు కాస్త బ్రేక్ ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు, అంత‌ర్జాతీయంగా చ‌మురు వినియోగం త‌గ్గ‌డం వంటి కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ ఇది స‌గ‌టు సామాన్యుడికి మాత్రం కాస్త ఊర‌ట క‌లిగించే అంశ‌మే. తాజాగా సోమ‌వారం కూడా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌లేదు. అందులోనూ విశాఖ‌పట్నంలో కాస్త త‌గ్గుద‌ల క‌నిపించింది. దేశ వ్యాప్తంగా నేడు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. * దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 90.40గా ఉండ‌గా డీజిల్ రూ. 80.73 వ‌ద్ద కొన‌సాగుతోంది. * ఇక దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో సోమ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.83గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 87.81గా ఉంది. * ఎన్నిక‌లు జ‌రుగుతోన్న‌వెస్ట్ బెంగాల్‌లోనూ ఇంధ‌న ధ‌ర‌ల్లో మార్పులు క‌నిపించ‌లేవు. కోల్‌క‌తాలో నేడు లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 90.62గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ.83.61 వ‌ద్ద కొన‌సాగుతోంది. * ఇక క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.93.43గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 85.60 వ‌ద్ద కొన‌సాగుతోంది. * త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 92.43గా ఉండ‌గా డీజిల్ రూ.85.75 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.93.99 గా ఉండ‌గా.. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 88.05 వ‌ద్ద కొన‌సాగుతోంది. * తెలంగాణ‌లో మ‌రో ముఖ్య ప‌ట్ట‌ణ‌మైన వ‌రంగ‌ల్‌లోనూ ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌లేదు. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 95.52గా ఉండ‌గా.. రూ. 87.65గా ఉంది. * ఇక ఆంధ్ర ప్ర‌దేశ్ విష‌యానికొస్తే విజ‌యవాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.72గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 90.21గా ఉంది. * సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర కాస్త త‌గ్గి 95.36 (ఆదివారం రూ. 95.48)గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 88.92 (89.03) వ‌ద్ద కొన‌సాగుతోంది.

Also Read: Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్‏లో ఇవాళ 10 గ్రాముల సిల్వర్ రేట్ ఎంతంటే..

Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా ? ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ ఎంత ఉందంటే..

RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌