Congress: కాంగ్రెస్‌లో రచ్చరచ్చ.. మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర రాత్రి హైడ్రామా..
హైదరాబాద్‌లోని మంత్రి కొండా నివాసం దగ్గర రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మఫ్టీలో మంత్రి ఇంటికి వెళ్లారు. సుమంత్‌పై ఉన్న అభియోగాలేంటో చెప్పాలని.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని మంత్రి కొండా నివాసం దగ్గర రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మఫ్టీలో మంత్రి ఇంటికి వెళ్లారు. సుమంత్‌పై ఉన్న అభియోగాలేంటో చెప్పాలని.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ప్రభుత్వంలో ఉన్నామా.. లేకపోతే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి దగ్గర జరిగిన పరిణామాలపై మాట్లాడారు మంత్రి కొండా సురేఖ. అదే సమయంలో మాజీ OSD సుమంత్‌పై నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను మంత్రి కొండా సురేఖకు సుస్మిత వివరించారు. ఆ తర్వాత కొండా సురేఖ.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లారు . ఆ సమయంలో సుమంత్ కూడా కారులోనే ఉన్నారు. పొన్నం ఇంట్లో లేకపోవడంతో మంత్రి వెనుదిరిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొండా సురేఖ కూతురు సుస్మిత- ఏకంగా సీఎంనే టార్టెట్ చేశారు.
ప్రస్తుతం కొండా సురేఖ ఎక్కడ ఉన్నారు? వరంగల్ వెళ్లారని చెబుతున్నా.. హైదరాబాద్‌లోనే మంత్రులను కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. OSDని సుమంత్‌ను కాపాడే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈరోజు కొండా సురేఖ వరంగల్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. ఈరోజు ఉదయం వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఉంది. మరి కొండా దంపతులు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంగానే మారింది. మరోవైపు వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సమావేశానికీ హాజరుపైనా సందిగ్ధతే ఉంది.




