గ్రేటర్ ఓటర్ ప్లీజ్ అటెన్షన్… ఓటర్ స్లిప్ పొందండిలా… పోలింగ్ స్టేషనూ కనుక్కొండి…

గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారంతా.. మీ ఓటర్ స్లిప్‌ను రెడీ చేసుకొని.. డిసెంబరు 1న ఓటు వేసేందుకు సిద్ధమవ్వండి. మరి ఓటర్ స్లిప్ పొందడం ఎలా..? పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడం ఎలా అంటే..?

గ్రేటర్ ఓటర్ ప్లీజ్ అటెన్షన్... ఓటర్ స్లిప్ పొందండిలా... పోలింగ్ స్టేషనూ కనుక్కొండి...
Follow us

|

Updated on: Nov 29, 2020 | 8:39 PM

GHMC ELECTIONS గ్రేటర్ లో పార్టీలు, నేతల ప్రచారం ముగిసింది. ఇక ఓటర్ వంతు వచ్చింది. నాయకుడిని ఎన్నుకునే అవకాశం వచ్చింది. ఓటుకు సమయం ఆసన్నమయింది. గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారంతా.. మీ ఓటర్ స్లిప్‌ను రెడీ చేసుకొని.. డిసెంబరు 1న ఓటు వేసేందుకు సిద్ధమవ్వండి. మరి ఓటర్ స్లిప్ పొందడం ఎలా..? పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడం ఎలా అంటే..?

జీహెచ్ఎంసీలో ఓటు వేసేందుకు అవసరమైన ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

1. గూగుల్ ప్టే స్టోర్ నుంచి మై జీహెచ్ఎంసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఇన్‌స్టాల్ పూర్తయిన తర్వాత.. యాప్ ఓపెన్ చేయాలి. పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి యాప్‌లోకి లాగిన్ కావాలి.

3. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై డౌన్ లోడ్ యూవర్ ఓటర్ స్లిప్, నో యూవర్ పోలింగ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి

4. తర్వాత సెర్చ్ బై ఎపిక్ నెంబర్ లేదా సర్చ్ బై నేమ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడీ నెంబర్ ఉంటే.. మీ వార్డు, ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే.. మీ ఓటర్ స్లిప్ వస్తుంది. అందులో మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ఉంటాయి.

5. ఒకవేళ ఓటర్ ఐడీ లేకుంటే మీ వార్డు, మీ పేరును ఎంటర్ చేయవచ్చు. తర్వాత మీ పేరుతో ఉన్న వాళ్ల వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ జాబితాలో ఇంటి నెంబర్, ఇంటి పేరుతో సెర్చ్ చేసి మీ వివరాలను గుర్తించవచ్చు.

6. మీ వివరాలపై క్లిక్ చేస్తే.. ఓటర్ స్లిప్ కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకోండి. అంతేకాదు వ్యూ డైరెక్షన్ ఆప్షన్ ద్వారా.. మీరుంటున్న ప్రాంతం నుంచి పోలింగ్ స్టేషన్‌కు గూగుల్ మ్యాప్స్‌లో దారి కూడా కనిపిస్తుంది. అలా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో