హైదరాబాద్‌లో 30 వేల మంది రోహింగ్యాలు ఉంటే అమిత్ షా నిద్రపోతున్నారా.? : మజ్లిస్ అధినేత ఒవైసీ
హైదరాబాద్‌లో 30వేల మంది రోహింగ్యాలు ఉంటే అమిత్ షా నిద్రపోతున్నారా అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు...
హైదరాబాద్‌లో 30వేల మంది రోహింగ్యాలు ఉంటే అమిత్ షా నిద్రపోతున్నారా అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు, విదేశీయులు ఉంటే రాసిమ్మంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ స్పందించారు. తానెందుకు రాసివ్వాలంటూ అసద్ నిలదీశారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థుల తరపున కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలకనేత అమిత్ షా ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా పాతబస్తీలో ఉన్న రొహింగ్యాల గురించి వ్యాఖ్యలు చేయగా మజ్లీస్ అధినేత పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.