Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా వంతు సాయంగా.. నిత్యం100మందికి అన్నం పెడుతున్న ఆదర్శ కుటుంబం.. ఎక్కడో కాదండోయ్‌..!

ఈ అన్నదాన కార్యక్రమం పదిమందితో మొదలై, ప్రస్తుతం 100 మందికి చేరింది..వీరు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి, రెండు గంటల వరకు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు.. గత 17 నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతినెల తమకు దాదాపు 1,50,000 వరకు ఖర్చు అవుతుందని, దాని అంతా కూడా తమ సంపాదన నుంచే ఖర్చు పెడుతున్నామని, ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మా వంతు సాయంగా.. నిత్యం100మందికి అన్నం పెడుతున్న ఆదర్శ కుటుంబం.. ఎక్కడో కాదండోయ్‌..!
Annadanam
P Shivteja
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 28, 2024 | 3:23 PM

Share

ఏది లోపించినా బ్రతకగలం. కానీ అన్నం కరువైతే బ్రతకలేం. అందుకే దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న.. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెబుతుంటారు..మనిషి ఆశకు అంతులేదు..అదుపు అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా…ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు. కాని, అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అలాంటి అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు ఈరోజుల్లో కూడా ఉన్నారంటే నమ్మగలరా..? అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు.. కానీ, ఇక్కడ ఆకలి చూసి అడక్కుండానే కడుపునింపుతున్నారు. తమ తల్లితండ్రుల జ్ఞాపకార్థం ప్రతిరోజు వంద మంది ఆకలి తీరుస్తూ అన్నపూర్ణగా మారింది ఆ కుటుంబం. పూర్తివివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో గల స్థానిక పెద్దమటంలో తోట కుటుంబానికి చెందిన సభ్యులు ప్రతిరోజు 100 మంది వరకు ప్రజల ఆకలి తీరుస్తున్నారు..తమ సంపాదనలో ఎంతో కొంత పేదలకు సాయం చేసి ఆపదలో ఉన్నవారికి తమ వంతు చేయూత అందించాలని నిశ్చయించుకున్నారు..తమ తల్లిదండ్రులు తోట మాణిక్యమ్మ, శంకరయ్య పటేల్ గార్ల జ్ఞాపకార్థం ఆ కుటుంబ సభ్యులు తమకు వచ్చే సంపాదనతో వృద్ధులు, వికలాంగులు, అనాధలకు ఏదో ఒకటి చేయాలని భావించారు.. రహదారులు, బస్టాండ్ ఇతర ప్రాంతాల్లో అన్నంకోసం కొంతమంది తపన చూసి చలించి పోయారు.. దీంతో అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు.

పట్టణంలోని పెద్దమటంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. గత సంవత్సరం జూలైలో ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం పదిమందితో మొదలై, ప్రస్తుతం 100 మందికి చేరింది..వీరు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి, రెండు గంటల వరకు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు.. గత 17 నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతినెల తమకు దాదాపు 1,50,000 వరకు ఖర్చు అవుతుందని, దాని అంతా కూడా తమ సంపాదన నుంచే ఖర్చు పెడుతున్నామని, ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సదాశివపేట పట్టణానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజు దాదాపు వందల మంది పని కోసం వస్తూ ఉంటారు.. అందులో కొంతమంది పని దొరక్క ఆకలితో అలమటిస్తున్న సమయంలో ఈ అన్నదానం వారికి అమృత ప్రసాదంగా మారింది…ప్రతిరోజు ఇక్కడికి వచ్చి భోజనం చేసి తమ ఆకలిని తీర్చుకుంటున్నామని పని దొరకని నాడు సైతం మాకు ఇక్కడ ఆకలి తీరుతుందని అక్కడికి వచ్చినవారు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..