AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీకడుపుతో ఇవి రెండంటే రెండే ఆకులు తినడం అలవాటు చేసుకోండి..! క్రమంగా మ్యాజిక్‌ చూస్తారు..

తులసి.. ఆధ్యాత్మీకంగానే కాదు.. ఆయుర్వేదపరంగా కూడా తులసీమాత అనే చెబుతారు. ఎందుకంటే..సర్వరోగాలను నయం చేసే సద్గుణాలు తులిసిలో నిండిఉన్నాయి. తులసి ఒక అద్భుతమైన ఔషధ మొక్క. తులసి ఆకులను అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా వినియోగిస్తారు. ఎన్నో రకాల అనారోగ్యాలను నయం చేసే గుణాలు తులసిలో ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తినమని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Jyothi Gadda
|

Updated on: Oct 27, 2024 | 1:34 PM

Share
 తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి.

1 / 5
తులసి ఆకులను తినటం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. తులసి ఆకులు పళ్లు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. తులసి ఆకుల రసం లేదా కషాయాన్ని నోటితో పుక్కిలించి ఉమ్మేయటం వల్ల నోటి నుంచి వచ్చే వాసన తగ్గిపోతుంది.

2 / 5
వర్షాకాలంలో తులసి ఆకులను తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. తులసి ఆకులను నమలడం వల్ల దానిలోని పోషకాల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

3 / 5
పరగడుపునే తులసి ఆకులను తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. అంతేకాదు, తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటును తగ్గించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

4 / 5
తులసిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, నరాల ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

5 / 5
Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..

IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు

ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు