Kishan Reddy: కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోంది.. జనసేనతో పొత్తు ఉండకపోవచ్చు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మీడియా సమావేశం అనంతరం కిషన్ రెడ్డి.. చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందన్నారు. కొత్త ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే వార్తలు బేస్ లెస్ అంటూ పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అంటూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం దమ్ముంటే KCR అవినీతిపై సీబీఐకి లేఖ రాయాలని సూచించారు. కేసీఆర్ అవినీతిపై CBIతో విచారణ జరిపించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేసీఆర్‌ను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందంటూ ఆరోపించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమని.. రేవంత్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదంటూ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే బీఆర్ఎస్‌తో అవగాహన చేసుకుందని చెప్పారు. అవినీతి, కుటుంబపాలన వల్లే.. ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఓడించారంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అవినీతిపై అనేక సార్లు ప్రస్తావించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి వివరించారు. ప్రస్తుత ముఖ్యముంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడిన అంశాలను ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రాజెక్టులు, స్కాంలపై దర్యాప్తు చేస్తామని చెప్పారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
ఆ వార్తలు బేస్ లెస్..
మీడియా సమావేశం అనంతరం కిషన్ రెడ్డి.. చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందన్నారు. కొత్త ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే వార్తలు బేస్ లెస్ అంటూ పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదని.. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపారన్నారు. ఎల్పీ నేత ప్రకటన అమిత్ షా వచ్చిన రోజే ప్రకటించాల్సిందని.. ఆ రోజు అమిత్ షా ఆలస్యంగా రావడంతో ఆగిపోయిందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే పరిశీలకులు ఎల్పీ నేతపై ప్రకటన చేస్తారన్నారు.
90 డేస్ యాక్షన్ ప్లాన్
మహిళలకు, బీసీలకు పార్టీ ఎంపీ టికెట్లలో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం 90 డేస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందన్నారు. అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని.. భవిష్యత్ లో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటుందన్నారు. అయ్యప్ప భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందంటూ పేర్కొన్నారు.
వీడియో చూడండి..
జనసేనతో పొత్తు ఉండకపోవచ్చు..
తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని.. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. జనసేన ప్రస్తుతం NDA లో భాగస్వామిగా ఉందని.. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు అంశం చర్చకు రాలేదన్నారు. BRS పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ లో లీడర్ ఎవరో తెలియదని.. బీజేపీకి ఓట్లు వేయడానికి జనాలు సిద్దంగా ఉన్నారంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..