Traffic Challans: పెండింగ్ చలాన్లు కడుతున్నారా.? తస్మాత్ జాగ్రత్త.! ఈ విషయం తెలుసుకోండి..
పెండింగ్ చలాన్లు కట్టడానికి తెలంగాణ పోలీసులు బంపర్ ఆఫర్ ఇస్తే.. దాన్నీ రాంగ్‌రూట్‌లో క్యాష్ చేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇప్పుడు జరిగిన మోసం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఏకంగా చలాన్లు కట్టేందుకు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

పెండింగ్ చలాన్లు కట్టడానికి తెలంగాణ పోలీసులు బంపర్ ఆఫర్ ఇస్తే.. దాన్నీ రాంగ్‌రూట్‌లో క్యాష్ చేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇప్పుడు జరిగిన మోసం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఏకంగా చలాన్లు కట్టేందుకు నకిలీ వెబ్‌సైటే తెరిచేసి అడ్డగోలు దందా మొదలెట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయం గుర్తించిన వెంటనే దాన్ని బ్లాక్ చేసిన పోలీసులు.. పబ్లిక్‌ని ఎలర్ట్ చేస్తున్నారు.
”ఈ-చలాన్ టీఎస్ పోలీస్.IN” పేరుతో నకిలీ వైబ్‌సైట్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు. అధికారికంగా అయితే ”ఈ-చలాన్.TSపోలీస్.GOV.IN” పబ్లిక్‌వ్యూ వెబ్‌సైట్‌లో మాత్రమే పే చేయాలి. లేదు అంటే.. పేటీఎం, మీ-సేవా సెంటర్స్‌లో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చు. పోలీస్ వెబ్‌సైట్ కాకుండా ఇతర ఆప్షన్లు కూడా ఉండడంతో ఈ తరహాలోనే పబ్లిక్‌ని చీట్ చేసేందుకు ఏకంగా ”ఈ-చలాన్ టీఎస్ పోలీస్.IN” అని క్రియేట్ చేశారు.
TSపోలీస్ అనే పదాలు చూసి చాలామంది ఇదే ఒరిజినల్ అనుకుని డబ్బులు కట్టారు. ఈ నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసినవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ డిస్కౌంట్ పెట్టింది. టూవీలర్స్,త్రీ వీలర్స్‌పై 80 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం, కార్ల సహా ఇతర ఫోర్‌వీలర్లకు 60 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో చాలా మంది వాటిని క్లియిర్ చేస్తున్నారు. ఇదే అదనుగా ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి మోసానికి తెరతీశారు.