Telegram Free Movies: రిలీజ్ మూవీ ఫ్రీగా చూస్తారా..? ఆశ పడితే గోసే! హెచ్చరిస్తున్న సైబర్ దోస్త్.

Telegram Free Movies: రిలీజ్ మూవీ ఫ్రీగా చూస్తారా..? ఆశ పడితే గోసే! హెచ్చరిస్తున్న సైబర్ దోస్త్.

Anil kumar poka

|

Updated on: Jan 02, 2024 | 4:48 PM

సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. జనాన్ని బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది సినిమాలంటే ఇష్టపడతారు. కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపుతారు. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్‌లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. విడుదలైన 40 రోజుల తర్వాతే ఏ సినిమా అయినా ఓటీటీలో చూడొచ్చు. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ కు డబ్బులు కట్టాలన్న భావనతో ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఫ్రీ మూవీస్‌ కోసం సెర్చ్‌ చేస్తుంటారు.

సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. జనాన్ని బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది సినిమాలంటే ఇష్టపడతారు. కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపుతారు. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్‌లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. విడుదలైన 40 రోజుల తర్వాతే ఏ సినిమా అయినా ఓటీటీలో చూడొచ్చు. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ కు డబ్బులు కట్టాలన్న భావనతో ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఫ్రీ మూవీస్‌ కోసం సెర్చ్‌ చేస్తుంటారు. ఇలా వీరు చేస్తున్న ప్రయత్నాలే సైబర్‌ నేరగాళ్ల పంట పండిస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్‌ ఛానల్‌ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు.

సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్‌లో ఫ్రీ డౌన్ లోడ్‌ లింక్‌లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే పాప్‌ అప్‌ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతులలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్‌ల ద్వారా వచ్చే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.