సినీ ఫక్కీలో పసికందు కిడ్నాప్..! 30 గంటల్లో ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..
కిడ్నాప్ కు గురైన పాపను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టెక్నికల్ (ఐటి సెల్) టీం సహాయంతో, సిసి టీవి పుటేజ్ ఆధారంగా, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి.. నలుగురు మహిళలు ఆటో, స్కూటీ పై సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి వచ్చి, ఒక రోజు వయసు గల పాపను అపహరించినట్లు గుర్తించారు..
ఈనెల తొమ్మిదవ తేదీ నాడు మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అప్పుడే పుట్టిన ఆడ శిశువు అపహరణ కేసును ఛేధించారు పొలీసులు. కిడ్నాప్ కు గురైన పాపను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టెక్నికల్ (ఐటి సెల్) టీం సహాయంతో, సిసి టీవి పుటేజ్ ఆధారంగా, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి.. నలుగురు మహిళలు ఆటో, స్కూటీ పై సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి వచ్చి, ఒక రోజు వయసు గల పాపను అపహరించినట్లు గుర్తించి, సిసి టీవి పుటేజ్, నెట్ వర్క్ సహాయంతో వివరాలను సేకరిస్తూ తీసుకొని, నిందితులను అరెస్ట్ చేశారు..వివరాల్లోకి వెళితే..
పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నిందితురాలు రుక్సానా బేగం కు గత 16 సంవత్సరాల క్రితం సంగారెడ్డి నివాసి అయిన దస్తగిరితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. గత కొన్ని రోజుల క్రితం తన భర్త దస్తగిరి చనిపోవడంతో హైదరాబాద్, బోరబండలో నివాసం ఉంటూ.. బార్కస్ (ఓల్డ్ సిటీ) నివాసి అయిన మహమ్మద్ సమీర్ ను వివాహం చేసుకుంది. తన భర్త ఆస్తిలో వాటా తీసుకోవాలని, పిల్లలు పుట్టే అవకాశం లేనందున.. సిటీలోని డెలివరీ హాస్పిటల్స్ లో ఎవరైనా డబ్బులకు పిల్లలను ఇస్తారేమోనని ప్రయత్నం చేయగా ఫలించలేదు..దీంతో 09వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో దొంగతనం చేసి పిల్లను దొంగలించుకొని వెళ్ళి తన భర్తకు చూపించాలనుకుంది.
చిన్నమ్మ కూతురు అయిన ముస్కాన్ బేగం ఆమె కొత్త స్కూల్ (బర్గ్ మాన్) పై సంగారెడ్డి రాగా, ముస్కాన్ చెల్లెలు అయిన జువేరియా పాతిమా, రుక్సానా బేగం తల్లి సయిదా బేగం బస్సులో వచ్చి ముస్లిం బుర్కాలు వేసుకొని ఆసుపత్రి వెనక డోర్ నుండి వెళ్ళి అక్కడ హాల్ లో పడుకోబెట్టిన ఒక బేబీని సయిదా బేగం దొంగిలించుకొని రాగా స్కూటీ, ఆటో లో బోరబండా తీసుకొని వెళ్లారని అన్నారు.
పాపను కిడ్నాప్ చేయాలని దురుద్దేశంతో రుక్సానా బేగం సంగారెడ్డి వచ్చి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరోజు వయసు గల పాపను అపహరించుకుని బోరబండకు తీసుకొని వెళ్లడంలో సహకరించిన తల్లి సయిదా బేగం చెల్లెల్లు ముస్కాన్, జువేరియా పాతిమా లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించారు పొలీస్ లు..కిడ్నాప్ కు గురైన పాపను తన తల్లి చెంతకు చేర్చడంతో తల్లి సంతోషానికి అవదులు లేవని. తన కూతురిని తిరిగి తనకు అప్పగించినందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..