Rain Alert: తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
ఇదిలా ఉంటే తెలంగాణలో వ్యాప్తంగా రానున్న మూడురోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక శనివారం రోజుల పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కాగా గురువారం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో వ్యాప్తంగా రానున్న మూడురోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక శనివారం రోజుల పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని.. ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..