Khammam Tragedy: ఇంట్లో కదల్లేని స్థితిలో కనిపించిన కూతురు.. ఏమైందోనని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఓ యువతీ ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఓ యువకుడి వేధింపుల కారణంగానే తన కుమార్తే ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఓ యువతీ ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆ ఓ యువకుడి వేధింపుల కారణంగానే తన కుమార్తే ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలానికి చెందిన నరేష్ అనే యువకుడు గేటు రేలకాయ పల్లి గ్రామంలో ఆర్ఎంపీగా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన సందీప్తి అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వీళ్లు సరదాగా ఉండే వారు.. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అయితే వీరి ప్రేమ విషయం అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియడంతో.. ఆమె తల్లిదండ్రులు అబ్బాయిని కలవద్దని హెచ్చరించారు. దీంతో పాటు సదురు యువకుడిపై ఆమ్మాయి పేరెంట్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన సందీప్తి.. ఇంట్లో ఎవరూ సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అంతలోని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆమెనను గమనించి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు చేరుకునేలోపే ఆమె మరణించింది. అయితే నరేష్ అమ్మాయితో దిగిన సెల్ఫీ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడం వల్లే.. తమ కుమార్తే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని బాధిత తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఇక బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అబ్బాయి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం కారణంగా అమ్మాయి మృతి చెందిందా? లేదా తల్లిదండ్రుల వేధింపుల వల్ల మృతి చెందిందా? అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
