కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ దిగాయి.. కార్మికుల ఆచూకి దొరికినట్లేనా?
SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ సర్కార్ 2 క్యాడవర్ డాగ్స్‌ను శ్రీశైలం పంపించింది. వాసనల్ని పసిగట్టడంలో ఈ డాగ్స్ వెరీ స్పెషల్. అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే వినికిడి శక్తి క్యాడవర్ డాగ్స్ సొంతం. కేరళలోని వయనాడ్ను రాత్రికి రాత్రి వరదలు ముంచెత్తిన తర్వాత శిథిలాల కింద అనేక మందిని ఈ డాగ్స్ గుర్తించాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్లో తలమునకై పోయాయి. దీంతో కేరళ సర్కార్ నేషనల్

SLBC టన్నెలో ఎనమిది మంది ఆచూకీ కోసం పదమూడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. డీపీఆర్ డేటా ఆధారంగా టన్నెల్‌లో తవ్వకాలు జరుగుతున్నాయి. GPR మిషన్ డేటా ఆధారంగా ఎనమిది స్పాట్స్ గుర్తించారు. నాలుగు ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. మిగతా నాలుగు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నాయి. ఘటన జరిగిన మొదటి రోజు నుంచే నాన్‌స్టాప్‌గా సహాయక చర్యలు కొనసాగుతున్నా కూడా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకీ ఈ ఆపరేషన్ కష్టంగా మారుతుంది.
తవ్వేకొద్దీ ఊటనీరు భారీగా ఉబికి వస్తుండడంతో భారీ మోటర్లు ఏర్పాటు చేసి డీవాటరింగ్ సిస్టం ద్వారా నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్‌పై బురద, మట్టి పెద్ద మొత్తంలో పేరుకుపోయింది. అది తొలగించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైర్ జెట్స్ వాటర్ పంప్స్‌తో బురదను తొలగిస్తూ చివరి డెస్టినేషన్ పాయింట్ వరకు చేరుకునేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ సర్కార్ 2 క్యాడవర్ డాగ్స్‌ను శ్రీశైలం పంపించింది. వాసనల్ని పసిగట్టడంలో ఈ డాగ్స్ వెరీ స్పెషల్. అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే వినికిడి శక్తి క్యాడవర్ డాగ్స్ సొంతం. కేరళలోని వయనాడ్ను రాత్రికి రాత్రి వరదలు ముంచెత్తిన తర్వాత శిథిలాల కింద అనేక మందిని ఈ డాగ్స్ గుర్తించాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్లో తలమునకై పోయాయి. దీంతో కేరళ సర్కార్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అభ్యర్థన మేరకు సహాయ చర్యల కోసం 2 స్నిఫర్ డాగ్స్‌ను పంపించింది. మృతదేహాలను గుర్తుపట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందాయి ఈ స్నిఫర్ డాగ్స్. సహాయచర్యల్లో వీటిని వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
