KA Paul: డొనాల్డ్ ట్రంప్ నాకు మంచి స్నేహితుడే.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో చూశారా..?

డొనాల్డ్ ట్రంప్ నాకు మంచి స్నేహితుడే.. అప్పటి నుంచి నాకు తెలుసు.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఎప్పుడూ రాజకీయాలపై ఏదో ఒక వ్యాఖ్యలు చేసే కేఏ పాల్ తాజాగా.. ట్రంప్ గురించి, అమెరికా ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలుచేశారు.

KA Paul: డొనాల్డ్ ట్రంప్ నాకు మంచి స్నేహితుడే.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో చూశారా..?
Ka Paul Donald Trump
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2024 | 6:53 PM

అమెరికా అధ్యక్షుడిగా మరోసారి గెలిచి డొనాల్డ్ ట్రంప్ చరిత్ర లిఖించారు.. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టనున్నారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్షుడి ఎన్నికల పోరులో కమలా హారిస్‌పై ట్రంప్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు సొంతంచేసుకున్నారు. అటు సెనెట్‌, పాపులర్‌ ఓట్లలోనూ ట్రంప్‌దే పైచేయి కనిపించింది.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా.. జేడీ వాన్స్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. అయితే.. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అధ్యక్షుడిగా గెలిచి రికార్డు సాధించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుభాకాంక్షలు తెలియజేశారు.

గురువారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు కూడా ట్రంప్ గెలుస్తారని ఊహించలేదని.. పేర్కొన్నారు. 92% మంది కమలహారిస్ ను సపోర్ట్ చేశారని.. కానీ ఓడిపోయారని.. ట్రంప్ మాత్రం రికార్డు స్థాయిలో విజయం సాధించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కమల హరీస్ కు సపోర్ట్ చేశారని.. కానీ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ కు సపోర్ట్ చేస్తున్నాని చెప్తున్నారు… అది కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

1994 నుంచి తనకు ట్రంప్ మంచి స్నేహితుడని.. కేఏ పాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ తప్పకుండా కృషి చేయాలంటూ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..