Viral: మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!

Viral: మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!

Anil kumar poka

|

Updated on: Nov 07, 2024 | 5:44 PM

మెదక్‌ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడంలేదని యువతిపై దారుణానికి తెగబడ్డాడు. కత్తితో దాడిచేసి యువతిని తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. దివ్యవాణి అనే యువతి మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్‌ డిగ్రీ ఎగ్జామ్‌ రాసేందుకు వెళ్తోంది. కొంతకాలంగా యువతిని చేతన్‌ అలియాస్‌ కిరణ్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు.

దివ్యవాణి అనే యువతి మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్‌ డిగ్రీ ఎగ్జామ్‌ రాసేందుకు వెళ్తోంది. కొంతకాలంగా యువతిని చేతన్‌ అలియాస్‌ కిరణ్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. యువతి తిరస్కరించడంతో దారుణానికి పాల్పడ్డాడు. ఎగ్జామ్‌ రాసేందుకు వెళ్తున్న యువతిని దారికాచి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి చేతికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు. ఆమె ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి బెంగళూరుకు చెందిన యువకుడుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. టౌన్ ఇన్స్‌పెక్టర్‌ నాగరాజు, ఏఎస్సై రుక్సానా సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.