AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode: ‘ఫస్టు ప్లేసులో నేను… ఇంతకీ సెకండ్‌ ప్లేస్‌ ఎవరు’.. సీరియస్ ఎన్నికలో కామెడీ ‘పాల్’

ఫస్టు ప్లేసులో నేను... ఇంతకీ సెకండ్‌ ప్లేస్‌ ఎవరిది? థర్డ్‌ ప్లేస్‌ ఎవరిది? ఇదీ.. మునుగోడు ఉప ఎన్నికల్లో... ఆయన కాన్ఫిడెన్స్‌!. క్యాంపెయినింగ్‌ నుంచి పోలింగ్‌ దాకా... ఆ హంగామాకు అంతే లేదు. మరిప్పుడేమైంది?? ప్రపంచనేతకు ఏ రౌండులోనూ పట్టుమని పది ఓట్లు కూడా రాలలేదా? నాకు నేనే పోటీ అనుకున్న పాల్‌ సార్‌... నోటాతో పోటీ పడాల్సి వచ్చిందా?

Munugode: 'ఫస్టు ప్లేసులో నేను... ఇంతకీ సెకండ్‌ ప్లేస్‌ ఎవరు'.. సీరియస్ ఎన్నికలో కామెడీ 'పాల్'
Ka Paul In Munugode
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2022 | 9:57 AM

Share

మునుగోడు ప్రచారంలో పీకల్లోతు మునిగిపోయిన నాయకుడెవరైనా ఉన్నారా? అంటే… అది కచ్చితంగా కేఏ పాల్‌. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఉపసమరంలో దిగిన పాల్‌… మునుగోడులో తిరగని ఊరు లేదు, సందడి చేయని గల్లీ లేదు. ప్రధాన పార్టీలను మించి … నియోకవర్గంలో పాతుకుపోయి ప్రచారం నిర్వహించారు. పాల్‌ సార్‌ చేసిన హంగామా ఎంతని చెప్పగలం. ఒక్కటా రెండా…! రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో ఆయన చేసిన ఎంటర్‌టైన్మెంట్‌.. నియోజకవర్గ జనాలనే కాదు.. దాన్ని టీవీల్లో చూసిన కోట్లాది మందిని… ఓ రేంజ్‌లో అలరించేసిందనే చెప్పాలి. సూపర్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.  అంతేనా..! ఫ్లయింగ్‌ కిస్సులిస్తూ ఆయన చేసిన హంగామా.. క్యాంపెయిన్‌లోనే సరికొత్త జోష్‌ని నింపింది. ఇక రోజుకో వేషం వేసి తన మార్క్ చూపించారు.

ఒక రకంగా చెప్పాలంటే… ప్రధాన పార్టీల క్యాండిడేట్లు సైతం.. పాల్‌ రేంజ్‌లో ప్రచారం చేయలేకపోయారంటే నమ్మాల్సిందే. ఏ చౌరస్తాలో చూసినా ఆయనే.. ఏ గల్లీలో చూసినా ఆయనే అన్నట్టుగా దూసుకెళ్లిపోయారు. వారెవ్వా … కాన్ఫిడెన్‌ అంటే ఇది అన్నట్టుగా… ఆయన మాటలు వింటే… వేరేవాళ్లెవరైనా గెలుస్తారని అనుకుంటారా? అలాంటి హడావుడితోనే అందరి దృష్టినీ ఆకర్షించారు పాల్‌ సార్‌. ప్రచారంలోనే కాదు.. పోలింగ్‌ రోజున కూడా ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు సామీ…! కొంపలారిపోతున్నట్టు ఆయన పెట్టిన పరుగులు చూస్తే… ప్రత్యర్థుల గుండెల్లో విమానాలు పరుగెత్తాల్సిందే.

ఇంతా చేస్తే… పాపం పాల్‌సార్‌ని అస్సల్‌ పట్టించుకోలేదు మునుగోడు ఓటర్లు. ఉద్యోగాలు, దవాఖానలు, రోడ్లు, కంపెనీలు… ఒక్కటేమిటి? మునుగోడును అమెరికా చేస్తానన్నా ఆయణ్ని ఎవరూ లెక్కచేయలేదు. రౌండు రౌండుకూ నోటాతో పోటీపడుతూ ఆయన ముందుకు సాగిపోయారు.  మొత్తంగా ఆయనకు  805 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో నోటాకు 482 ఓట్లు పడ్డాయి. ఇంతకీ పాల్‌కు ఇంతటి ఘోర పరాభవం ఎదురుకావడానికి.. కారణమేంటి? ఆయన చేస్తున్న కొత్త డిమాండ్‌ ఏంటి? అదేదో.. ఆయన చెబితేనే బాగుంటుంది? ఎందుకంటే ఆయన చెప్పే ముచ్చట అలాంటిది మరి.

ఏం చేశారని రాజగోపాల్‌కు ఓట్లు వేస్తారు…ఏం చేశారని జనం టీఆర్ఎస్‌కు జై కొడతారు…..నాలా డాన్సులు చేశారా… నాలా గొర్రెలను కాశారా…నాలా హామీల పత్రం రచ్చించి అచ్చేశారా… నాలా టీలు కాచారా…టిపనీలు చేసారా…ఏం చేశారని వాళ్లకు ఓట్లేస్తారు…ఇది ముమ్మాటికీ ఎక్కడో ఏదో తేడా కొట్టింది..నన్ను టార్గెట్‌గా ఏదో కుట్ర జరిగింది ఇది తేలాలంటే ముందు కోర్టుకెళ్లాలి…కోర్టుకెళ్లాలంటే ముందు మునుగోడును వదిలి వెళ్లాలి…అందుకే వెళ్తున్నా…టాటా బైబై అంటూ ఏదోదో చెప్పుకుని..ఏదోదో మాట్లాడేసుకుని..తన లక్ష ఓట్లు గల్లంతు కావడం మూలాన ఎలక్షన్స్‌నే రద్దు చేయాలని ఫైనల్‌గా డిసైడ్ చేశారు పాల్‌ సార్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..