AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode: టీఆర్‌ఎస్‌కి కలిసొచ్చిన 5 అంశాలు- బీజేపీ ఓటమికి 5 కారణాలు – కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతుకు 5 రీజన్స్‌

మునుగోడు గెలుపు గులాబీ పార్టీలో కొత్తజోష్​ నింపింది. ఇదే ఉత్సాహంతో జాతీయ రాజకీయాలవైపు వడివడిగా అడుగులు వేసేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ఓటమితో రివ్యూ ప్రారంభించాయి.

Munugode: టీఆర్‌ఎస్‌కి కలిసొచ్చిన 5 అంశాలు- బీజేపీ ఓటమికి 5 కారణాలు - కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతుకు 5 రీజన్స్‌
Munugode By Poll Candidates
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2022 | 9:15 AM

Share

ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు అంతా అక్కడే మకాం వేసి గడప గడపకు తిరిగి కారును టాప్‌గేర్‌లో పరిగెత్తించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అధికార పార్టీని బలంగా ఢీకొట్టారు. కానీ సెకండ్‌ ప్లేస్‌కే పరిమితం అయ్యారు. ఇక కాంగ్రెస్‌ సంగతి చెప్పనక్కర్లేదు. డిపాజిట్‌ కూడా కోల్పోయింది. హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల 97,006 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,697 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. సిట్టింగ్‌ సీటు కోసం పోరాడిన కాంగ్రెస్‌కి 23,906 ఓట్లు రావడంతో డిపాజిట్‌ కూడా దక్కలేదు.

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉపఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పక్కా వ్యూహం.. పకడ్బంధీ ప్రణాళికలతో బరిలోకి దిగాయి. కానీ చివరకు మునుగోడు ప్రజలను కారునే పరిగెత్తించారు. ఇక బీజేపీ ఉప ఎన్నిక అస్ర్తం ఫలించలేదు. ఎంత చేసినా అంతే అన్నట్టు తయారైంది కాంగ్రెస్‌ పరిస్ధితి.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి కలిసి వచ్చిన అంశాలేంటి? బీజేపీ ఓటమికి రీజనేంటి? కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయేంత తప్పులేం చేసింది…మూడు పార్టీల బలాలు బలహీనతలు ఓసారి చూద్దాం పదండి.

టీఆర్‌ఎస్‌కి కలిసొచ్చిన 5 అంశాలు =================

-ఆద్యంతం సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణ

-చెమటోడ్చిన మంత్రులు, నేతలు

-కలసివచ్చిన వామపక్షాల మద్దతు

-మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్‌ హామీ

-ప్రచార అస్త్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం

బీజేపీ ఓటమికి 5 కారణాలు ==============

-18 వేల కోట్ల ప్రచారానికి సరైన కౌంటర్ ఇవ్వకపోవడం

-కోవర్ట్ బ్రదర్స్ అంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారం మైనస్

-కాంగ్రెస్ నాయకులను వెంట తీసుకెళ్లడంలో సక్సెస్ కాలేదు

-ప్రభావం చూపని బీజేపీ మేనిఫెస్టో

-చివరి 3 రోజు టైం వేస్ట్..అగ్రనేతలు రాకపోవడం

కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతుకు 5 రీజన్స్‌ ===============

-మునుగోడులో సరిగ్గా ప్రచారం చేయకపోవడం

-సీనియర్లంతా రాహుల్‌ జోడో యాత్రకు క్యూ కట్టడం

-రేవంత్‌కు ప్రజాకర్షణ ఉన్నా ఇతర నేతలు దూరం కావడం

-అంతర్గత కలహాలతో సీనియర్ల సహాయ నిరాకరణ

-ఓడిపోయే సీటంటూ వెంకట్‌రెడ్డి కామెంట్‌ చేయడం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..