Refrigerator Explosion: షాకింగ్ ఘటన.. ముగ్గురి ప్రాణాలు మింగేసిన రిఫ్రిజిరేటర్..
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో వున్న ఫ్రిజ్ పేలిపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో చోటుచేసుకుంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో వున్న ఫ్రిజ్ పేలిపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లా కోదండరామ్ నగర్ ఉర్పాకమ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ఆర్ బృందావన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిని గిరిజ, ఆమె సోదరి రాధ, బంధువు రామ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనలో రామ్ కుమార్ భార్య భార్గవి, కుమార్తె ఆరాధాన తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వీరికి ప్రస్తుతం క్రోమ్‌పేట్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. రామ్ కుమార్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ నుంచి వచ్చిన మర్నాడే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. గతేడాది అనారోగ్యంతో మరణించిన గిరిజ భర్త ఆబ్దికం కోసం రామ్‌కుమార్ దంపతులు వచ్చి మృత్యువాత పడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించినట్టు భావిస్తున్నారు. పేలుడు శబ్దంతో మేల్కొన్న పొరుగింటివారు గిరిజ ఇంటి తలుపులు తెరిచి కాపాడే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుదువంచెరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

