Brother - sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 03, 2022 | 8:21 PM

మాథ్స్ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అందుకనే విద్యార్థి దశలో గణిత శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అయితే చాలామంది గణితాన్ని ఓ మిస్టరీ సబ్జెక్ట్‌గా భావిస్తారు. మాథ్స్‌లో చాలా రకాల లెక్కలు సాల్వ్ చేయలేని స్టూడెంట్స్‌పై టీచర్స్ అగ్రహం వ్యక్తం చేస్తారు.


ఏ స్టూడెంట్ అయినా తాను బోధించిన అంశాన్ని అర్థం చేసుకోకపోతే.. ఆ ఉపాద్యాయుడు కలత చెందడం సాధారణం. అదే సమయంలో.. తాను ఎన్ని సార్లు ఎంత చెప్పినా విద్యార్థికి అర్ధం కాకపోతే.. ఆ టీచర్ విసుగు చెందుతాడు. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెక్కలు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతుందంటూ ఓ టీచర్ ఏడుపందుకున్నాడు. చైనాకు చెందిన అబ్బాయి తన చెల్లెలికి గణితం బోధిస్తున్నారు. త్రిభుజం గురించి తన చెల్లెలికి వివరించి విసిగిపోయాడు. అయినప్పటికీ ఆ చెల్లెలికి ఏమీ అర్థం కాలేదు. చెప్పి చెప్పి విసిగిన అన్న.. కాసేపటి తర్వాత చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. గణితాన్ని అర్థం చేసుకోవడంలో పెద్ద సమస్య అని.. వారు బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. తన చెల్లికి లెక్కలు చెప్పలేక కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు ఆ అన్న. వైరల్ అవుతున్న ఈ వీడియో ‘పాపం రిలేటబుల్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bath Tub: మనుషుల స్నానానికి బాత్‌ మెషీన్‌..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..

Puri Jagannath: పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమాలేంటి..? పూరి ప్లాన్ ఏంటి.? ఈసారి ఎలా వస్తున్నాడు అంటే..

 

Published on: Nov 03, 2022 08:21 PM