Man - Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 03, 2022 | 8:58 PM

పుర్రెకో బుద్ధి.. మనిషికో రీతి అన్నారు.. ఈ సృష్టిలో ఒక్కో సంఘటన ఒక్కోసారి భలే విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదుగానీ.. కొన్ని పనులు మాత్రం విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


విచిత్ర ధోరణితో ఫ్లోరిడా ప్రజలు వార్తల్లోకి ఎక్కుతారనే ప్రచారం ఉంది. ఆ కోవకు చెందినదే.. ఓ వ్యక్తి మొసలితో చేసిన సరదా పనిని ఇంర్నెట్‌లో పోస్ట్‌ చేశాడు. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి నీటి కొలనులో మొసలితో రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేసినట్లు విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే, ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం మరోసారి తెగ చక్కర్లు కొడుతోంది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్‌ దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చింది. నమ్మశక్యంగా అనిపించని ఆ సరదా వీడియో మరోసారి తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షేర్ చేస్తూ.. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. అది పెళ్లామో .. గర్ల్‌ఫ్రెండో కాదని, మొసలికి నీళ్లలో బలం ఎక్కువని, తేడా వస్తే పని అంతేఅని కొందరు.. ఆ మొసలికి అతను బాగా నచ్చి ఉంటాడని మరికొందరు.. ఇలా కామెంట్ల పర్వం కొనసాగుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bath Tub: మనుషుల స్నానానికి బాత్‌ మెషీన్‌..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..

Puri Jagannath: పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమాలేంటి..? పూరి ప్లాన్ ఏంటి.? ఈసారి ఎలా వస్తున్నాడు అంటే..