AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: ఉంగరం గుర్తుకు ఓటేస్తే.. మునుగోడును అమెరికాలా మారుస్తా.. ఉప ఎన్నిక ప్రచారంలో కేఏ పాల్‌

బుధవారం మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కే ఏ పాల్.. ఓ హెటల్ లో దోశెలు వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే..అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు.

Munugode Bypoll: ఉంగరం గుర్తుకు ఓటేస్తే.. మునుగోడును అమెరికాలా మారుస్తా.. ఉప ఎన్నిక ప్రచారంలో కేఏ పాల్‌
Ka Paul
Basha Shek
|

Updated on: Oct 19, 2022 | 6:43 PM

Share

ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మునుగోడు ఉప ఎన్నికలో ఈరోజు నుంచి ప్రచారం ప్రారంభించారు. అయితే ఆయన ఈ ఎన్నికలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఇన్‌యాక్టివ్‌గా గుర్తించడంతో ఆయన స్వతంత్ర్య అభ్యర్థిగా మునుగోడు బరిలో దిగారు. బుధవారం మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కే ఏ పాల్.. ఓ హెటల్ లో దోశెలు వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే..అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు. ‘నాకు దోశెలు వేయడం రాదని అనుకుంటున్నారా? నేను పదోతరగతి రెండుసార్లు తప్పాను. 6 ఏళ్ల ప్రాయంలో బాలకార్మికునిగా పని చేశాను. దోశెలు వేయడంతో పాటు అన్ని పనులు వచ్చు. ఇక ఈ ఎన్నికల్లో నాకు ఉంగరం గుర్తును కేటాయించారు. ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా చేసి పారెద్దాం. మీరు నన్ను గెలిపిస్తే ఏడు మండలాల్లో ఏడు వేల మందికి ఉద్యోగాలిప్పిస్తాను. అందుకే నిరుద్యోగులందరూ నా పార్టీలో జాయిన్‌ అవ్వండి. ఈ వీడియోను చూస్తున్న వారందరూ షేర్‌ చేయండి. ఉంగరం గుర్తుకు ఓటేయ్యండి. మునుగోడును అమెరికాలా మార్చుకుందాం’

6 నెలల్లో 7వేల మందికి ఉద్యోగాలు..

‘ఇక నన్ను గెలిపిస్తే రెండేళ్లలో నియోజకవర్గంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను. మొదటి ఆరు నెలల్లో 7 వేల మందికి జాబ్‌లు ఇప్పిస్తాను. అలాగే పిల్లలందరికీ కేజీ టు పీజీ ఉచిత విద్య, మండలానికో ఆస్పత్రి, కళాశాల ఏర్పాటుచేయిస్తాను. ఉంగరం గుర్తుకు ఓటేసి నియోజకవర్గాన్ని గెలిపించుకుందాం. బీజేపీ, టీఆర్‌ఎస్‌ లాంటి కుల పార్టీలను ఇంటికి పంపేద్దాం’ అని పాల్‌ పిలుపునిచ్చారు. కాగా ఇటీవల ప్రజాశాంతి పార్టీని ఇన్‌ యాక్టివ్‌గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అందుకే ఈ పార్టీ తరఫున మునుగోడు ఉప ఎన్నికలో నిలిచారు. నామినేషన్‌ కోసం కూడా రెడీ అయ్యారు.

ఇందుకోసం సరైన పత్రాలు సమర్పించినా కేఏ పాల్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. అదృష్టవశాత్తూ ఇండిపెండెట్‌ అభ్యర్థిగా వేసిన నామినేషన్‌కు మాత్రం ఆమోదం లభించింది. దీంతో తన సొంత పార్టీ పేరు, గుర్తుపై కేఏ పాల్ పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుర్తించిన ఈసీ.. ఆయనకు మునుగోడు ఎన్నికల్లో రింగు గుర్తును కేటాయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు