రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది.. బీజేపీ లక్ష్మణ్

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్‌భవన్‌ ముందు బీజేపీ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో లక్ష్మణ్‌తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా వారిని అరెస్ట్ చేసే సమయంలో లక్ష్మణ్ కంటికి స్వల్పగాయమై.. సొమ్మసిల్లి పడిపోయారు. లక్ష్మణ్‌కు బీజేపీ జాతీయ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి పరామర్శించారు. కాగా, ప్రస్తుతం నీమ్స్‌లో చికిత్స […]

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది.. బీజేపీ లక్ష్మణ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 12, 2019 | 10:02 PM

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్‌భవన్‌ ముందు బీజేపీ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో లక్ష్మణ్‌తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా వారిని అరెస్ట్ చేసే సమయంలో లక్ష్మణ్ కంటికి స్వల్పగాయమై.. సొమ్మసిల్లి పడిపోయారు. లక్ష్మణ్‌కు బీజేపీ జాతీయ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి పరామర్శించారు. కాగా, ప్రస్తుతం నీమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపారు. సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని.. దసరా పండుగకు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా.. 50 వేల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సెప్టెంబర్ నెల జీతాలు ఇచ్చి.. కార్మికులకు ఆపి.. పండుగ చేసుకోకుండా ఇబ్బందులకు గురిచేశారని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొరవడిందని..కేసీఆర నియంతలా పాలన కొనసాగిస్తున్నారని.. ప్రజా స్వామ్య రక్షణ కోసం, ఆర్టీసీని కాపాడుకునేందుకు బీజేపీ పోరాడుతుందని లక్ష్మణ్ తన సందేశాన్ని వీడియో ద్వారా తెలియజేశారు.