Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad News: కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రాణాలు కోల్పోయిన జూనియర్ ఆర్టిస్ట్..

Hyderabad News: రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్‌లో విషాదం ఘటన చోటు చేసుకుంది. చిన్న కన్‌ఫ్యూజన్ ఓ మహిళ నిండు ప్రాణం బలిగొంది.

Hyderabad News: కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రాణాలు కోల్పోయిన జూనియర్ ఆర్టిస్ట్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 19, 2022 | 8:40 AM

Hyderabad News: రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్‌లో విషాదం ఘటన చోటు చేసుకుంది. చిన్న కన్‌ఫ్యూజన్ ఓ మహిళ నిండు ప్రాణం బలిగొంది. వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి(28) హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగా, జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తోంది. అయితే, సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. ఇటీవల సొంతూరుకు వెళ్లింది. పండుగ ముగియడంతో సోమవారం రాత్రి తిరుగు ప్రయాణమైంది. అయితే, రైలు షాద్‌నగర్‌లో ఆగింది. దాంతో ట్రైన్ కాచిగూడకు చేరుకుందని భావించిన మహిళ.. ట్రైన్ దిగింది.

కానీ, రైలు ఆగింది షాద్‌నగర్ అని తెలియడంతో.. తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పటికే రైలు కదులుతోంది. అయినప్పటికీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అదుపు తప్పి కింద పడిపోయింది. జ్యోతి కింద పడిపోవడాన్ని ఎవరూ గమనించలేదు. ట్రైన్ వెళ్లిపోయిన తరువాత స్టేషన్‌లోని గార్డ్‌లు తీవ్ర గాయాలతో ఉన్న జ్యోతిని గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జ్యోతి మృతిపై ఆమె బంధువులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేశారు. జ్యోతి మృతికి రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:

Corona Positive: రాజకీయ నేతలను వెంటాడుతున్న కోవిడ్.. గండ్ర దంపతులకు కరోనా పాజిటివ్..

మైకేల్ జాక్సన్‌ను మించి పావురం డాన్స్‌ !! సోషల్‌ మీడియాలో ఓరేంజ్‌లో వైరల్‌ అవుతున్న వీడియో

Maheshwari: గులాబీలో సాంగ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్..