మైకేల్ జాక్సన్‌ను మించి పావురం డాన్స్‌ !! సోషల్‌ మీడియాలో ఓరేంజ్‌లో వైరల్‌ అవుతున్న వీడియో

ఓ పావురం తన డాన్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. ఈ పావురం అదిరిపోయే డాన్స్‌ చేస్తూ మైకేల్‌ జాక్సన్‌కే మతిపోయేలా మూన్‌ వాక్‌ చేస్తోంది.

Phani CH

|

Jan 19, 2022 | 8:35 AM

ఓ పావురం తన డాన్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. ఈ పావురం అదిరిపోయే డాన్స్‌ చేస్తూ మైకేల్‌ జాక్సన్‌కే మతిపోయేలా మూన్‌ వాక్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ యూజర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేసారు. వేలమంది నెటిజన్ల మనసు దోచుకున్న ఈ వీడియోను ఎంతగానో లైక్‌ చేస్తూ షేర్‌ చేసుకుంటున్నారు. పావురం డాన్స్‌పై రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ఆ మధ్య ఒక బాతు కూడా ఇలాగే అద్భుతంగా డాన్స్‌ చేసింది. తన డాన్స్‌తో మైకేల్‌ జాక్సన్‌ అభిమానులను ఫిదా చేసింది. అప్పట్లో ఈ వీడియో కూడా తెగ వైరల్‌ అయింది. ఇప్పుడు నేనేం తక్కువ కాదంటూ పావురం కూడా తనదైన స్టయిల్‌లో స్టెప్పులేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Also Watch:

Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య విడిపోడానికి అసలు కారణం ఇదే !! వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu