Viral Video: ముంబ‌యి వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతోన్న చిరుత‌.. నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియోలు..

Viral Video: అట‌వీ సంప‌ద త‌గ్గడం, ఆహారం ల‌భించ‌క‌పోవ‌డం, పట్ట‌ణీక‌ర‌ణ పెర‌గ‌డం కార‌ణ‌మేదైనా ఇటీవ‌ల అడ‌వుల్లో ఉండాల్సిన మృగాలు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. అయితే చిన్నాచిత‌క జంతువులు వ‌స్తే పెద్ద‌గా స‌మ‌స్య ఏం ఉండ‌దు కానీ కృర‌ మృగాలు...

Viral Video: ముంబ‌యి వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతోన్న చిరుత‌.. నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియోలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 18, 2022 | 8:55 PM

Viral Video: అట‌వీ సంప‌ద త‌గ్గడం, ఆహారం ల‌భించ‌క‌పోవ‌డం, పట్ట‌ణీక‌ర‌ణ పెర‌గ‌డం కార‌ణ‌మేదైనా ఇటీవ‌ల అడ‌వుల్లో ఉండాల్సిన మృగాలు జ‌నావాసాల్లోకి వ‌స్తున్నాయి. అయితే చిన్నాచిత‌క జంతువులు వ‌స్తే పెద్ద‌గా స‌మ‌స్య ఏం ఉండ‌దు కానీ కృర‌ మృగాలు వ‌స్తే మాత్రం ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఇటీవల జ‌న‌సంచారాల్లోకి కృర‌ మృగాల రాక ఎక్కువుతోంది. ముఖ్యంగా పులుల సంచ‌రం బాగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరుత సంచారానికి సంబంధించిన వార్త‌లు ఆడ‌పాద‌డ‌పా చూస్తూనే ఉన్నాం.

తాజాగా దేశ ఆర్థిక రాజ‌ధానిలో చిరుత సంచారం స్థానికుల‌ను ఉలిక్కిప‌డేలా చేసింది. ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో చిరుత సంచారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ముంబ‌యిలోని గోరెగావ్ అనే ప్రాంతంలో ఓ చిరుత సంచ‌రించింది. స్థానికంగా ఉన్న ఓ ఇంటిలోకి ప్ర‌వేశించి గేటు ముందు కూర్చుంది. అనంత‌రం అక్క‌డి నుంచి నెమ్మ‌దిగా క‌దులుతూ వెళ్లిపోయింది. ఇదంతా అక్క‌డే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను కాస్త సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఈ విష‌య‌మై అధికారులు స్పందిస్తూ.. స్థానికుల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌లను తొల‌గించేందుకు పాట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. స్థానికుల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు ప‌లు అవ‌గాహ‌న‌ క్యాంప్‌ల‌ను కూడా ఏర్పాటు చేయ‌నున్నామ‌ని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో చిరుత సంచ‌రించ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఇలాంటి వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: Bandi Sanjay: సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం స్వాగతిస్తాం.. మరీ, వాటి సంగతేంటిః బండి సంజయ్

IND VS SA: ఆరో బౌలర్‌ కొరత తీరింది.. స్పిన్నర్లలో ఒకరికి ఛాన్స్: తొలి వన్డే ముందు కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు

ఈ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్లు.. దీని రక్షణ కోసం సెక్యూరిటీ.. ఎందుకంత క్రేజ్‌ అంటే..?