Bandi Sanjay: సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం స్వాగతిస్తాం.. మరీ, వాటి సంగతేంటిః బండి సంజయ్
తెలంగాణ సర్కార్ 317 జీఓను సవరించే వరకు పోరాటం ఆగదీలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
Bandi Sanjay Kumar Comments: తెలంగాణ సర్కార్ 317 జీఓను సవరించే వరకు పోరాటం ఆగదీలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. 317 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. . ఉద్యోగులకు అండగా బీజేపీ ఉంది. మేము మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్న బండి సంజయ్.. ఉద్యోగ సంఘాలతో చర్చలు త్వరలోనే జరుపుతామన్నారు. ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 9 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 317 జీఓపై చర్చించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే కేసీఆర్ జాతకం బాగాలేదని అర్థమవుతోందన్న సంజయ్.. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుందని, టీచర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బండి సంజయ్.. మౌలిక వసతులు కల్పించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త డ్రామాలు ఆడుతున్న కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందన్న బండి సంజయ్.. ఆయన జాతకం ఇప్పుడు సరిగ్గా లేదన్నారు.
Read Also… Republic Day parade: ఈఏడాది రిపబ్లిక్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలకు దక్కని చోటు!