Jubilee Hills Bypoll: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు వేయొచ్చు.. ఈ కార్డులు ఉంటే చాలు..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఓటర్ జాబితాలో పేరున్నా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి సూచించారు. ఈ క్రమంలో ఓటర్ ఐడీ లేకున్నా 12 గుర్తింపు కార్డులు ఉంటే ఓటు వేయొచ్చని తెలిపారు. ఆ 12 గుర్తింపు కార్డుల జాబితాను విడుదల చేశారు.

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హీట్ నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. దీంతో పోరు రసవత్తరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని గెలిచి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంటే.. తమకు ఎదరులేదని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు వీలైనంత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యేలా చూడాలని ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఓటింగ్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు.
ఓటర్ ఐడీ కార్డుతో పాటు చెల్లుబాటయ్యే 12 ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల జాబితాను ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ కార్డులు ఉంటే మీరు ఓటు వేయొచ్చు.
- ఆధార్ కార్డు
- ఉపాధి హామీ జాబ్ కార్డు
- బ్యాంకు / తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్
- కేంద్ర కార్మిక శాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్
- డ్రైవింగ్ లైసెన్స్
- పాన్ కార్డు
- NPR స్మార్ట్ కార్డు
- భారతీయ పాస్‌పోర్ట్
- ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ గుర్తింపు కార్డులు
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
- యూనిక్ డిజేబుల్ ఐడెంటిటీ కార్డు
ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా.. పైన తెలిపిన 12 ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
