AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

College Ragging: ఇంటరాక్షన్ పేరుతో సీనియర్ల వికృత చేష్టలు.. జూనియర్లతో ఏం చేయించారంటే?

కాలేజ్‌లలో ర్యాగింగ్ అనేది కామన్.. అవి చిన్న చిన్నగా ఆట పట్టించడం వరకు ఓకే.. కానీ అది హద్దులు మీరితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. తాజాగా రాష్ట్రంలోని ఒక కాలేజ్ క్యాంపస్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కాలేజ్‌లోని సినియర్ విద్యార్థులు కొత్తగా వచ్చి విద్యార్థులను ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేశారు. వారితో వికృత చేష్టలకు దిగారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైలర్‌గా మారాయి. దీంతో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

College Ragging: ఇంటరాక్షన్ పేరుతో సీనియర్ల వికృత చేష్టలు.. జూనియర్లతో ఏం చేయించారంటే?
College Ragging
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 09, 2025 | 4:52 PM

Share

కాలేజ్‌లో కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థులను అమ్మాయి లాగా తయారు చేసి.. డాన్స్ చేయించి.. సీనియర్ విద్యార్థులు వికృత చేష్టలకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థులను నెల మీద బొర్లింస్తూ వారిని సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో “ఇంటరాక్షన్” పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను మానసికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ల ఒత్తిడి, బెదిరింపులతో జూనియర్ విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ వేధింపుల పై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. కాలేజ్‌లో యాంటీ ర్యాగింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీలు పేరుకే ఉన్నాయని, అవగాహన చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు, యాజమాన్యం కలిసి నిఘా కెమెరాలు, భద్రతా వ్యవస్థను సమీక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి” అంటున్నారు. విద్యార్థులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని తేలికగా తీసుకోకుండా ఇప్పటికైనా ఆగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కాలేజ్‌లో యాంటీ ర్యాగింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీలు చట్టపరంగా విద్యార్థులకు అవగాహన కల్పించి బాధ్యత వహించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని జూనియర్ విద్యార్థులు.. చెప్పడానికి భయపడడంతో నేరుగా కళాశాల ప్రిన్సిపాల్‌ స్పందించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us