AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Birthday: సీఎం బర్త్ డే అంటే ఇలా కదా చేయాల్సింది.. పిల్లల చదువుకు ఉపయోగపడేలా

సనత్‌నగర్ బస్తీలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా జరిగాయి. ప్లెక్సీలు, ఆర్భాటాలు లేకుండా.. అంగన్వాడీ సెంటర్‌ను మోడరన్‌గా తీర్చిదిద్ది చిన్నారుల మధ్య జన్మదినం జరిపిన కంజర్ల విజయలక్ష్మి యాదవ్ సేవా స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. వివరాలు కథనం లోపల..

CM Revanth Birthday: సీఎం బర్త్ డే అంటే ఇలా కదా చేయాల్సింది.. పిల్లల చదువుకు ఉపయోగపడేలా
Revanth Reddy Birthday Celebration
Ram Naramaneni
|

Updated on: Nov 09, 2025 | 6:56 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ నేత కంజర్ల విజయలక్ష్మి యాదవ్ సమాజానికి హితమైన సందేశం ఇచ్చారు. ప్రజలతో కలిసిమెలిసి పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజల ఆశీర్వాదాల మధ్య సేవ చేయాలని ఆకాంక్షించారు. సనత్‌నగర్‌ డివిజన్‌ శ్యామలకుంటలో శనివారం కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మంత్రి అజారుద్దీన్‌ ప్రధాన అతిథిగా హాజరై చిన్నారులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ సెంటర్‌ను స్వచ్ఛందంగా మోడరన్‌ రూపంలో తీర్చిదిద్దారు. రంగురంగుల అలంకరణలతో, కొత్త సదుపాయాలతో మెరుగైన వాతావరణంలో చిన్నారులు “హ్యాపీ బర్త్‌డే రేవంత్ మామ!” అంటూ ఉత్సాహంగా శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేస్తూ, పిల్లలతో నవ్వులు పంచుకుంటూ నాయకులు మమకారభరిత వాతావరణాన్ని సృష్టించారు.

ప్లెక్సీలు, హోర్డింగులు, ఆర్భాటాలు లేకుండా.. సేవాత్మకంగా జరిపిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం చిన్నారులకు బొమ్మలు, తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ కోట నీలిమ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలా అంగన్వాడీ సెంటర్‌లో జరిపిన ఈ వేడుక అందర్నీ ఆలోచింపజేసింది. నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి.. అనవసర ఖర్చు చేసే బదులు ఇలా చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Anganwadi Modernization

Anganwadi Modernization

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..