AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ, కాఫీ కాదు.. హైపర్ యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయాన్నే ఈ అల్పాహారం తినాల్సిందే

ఉదయం నిద్రలేవగానే చాలామంది చేసే మొదటి పని వేడివేడి టీ తాగడం. రాత్రి భోజనం తర్వాత సుదీర్ఘ విరామం ఉండటంతో ఉదయాన్నే విపరీతమైన ఆకలి వేయడం వల్ల ఈ అలవాటును వదులుకోవడం చాలామందికి అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీ, కాఫీ కాదు.. హైపర్ యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయాన్నే ఈ అల్పాహారం తినాల్సిందే
Healthy Morning Routine.jpg
Nikhil
|

Updated on: Mar 31, 2026 | 9:50 PM

Share

రోజంతా ఉత్సాహంగా, చైతన్యవంతంగా ఉండటంతో పాటు మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడానికి ఉదయం పూట ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. టీ లేదా కాఫీకి బదులుగా మన శరీరానికి శక్తినిచ్చే ప్రత్యామ్నాయాల గురించి, ఉదయం పూట మనం చేసే పొరపాట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

చాలామంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు, కానీ వీటిలో ఉండే కెఫీన్ వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంది. అందుకే నిద్రలేవగానే మొదట ఒక గ్లాసు మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

చర్మంపై ముడతలు..

ఉదయం పూట బిస్కెట్లు, కేకులు వంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా నీరసం, అలసట, చర్మంపై ముడతలు వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి బదులుగా అల్పాహారంలో జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. జింక్ చర్మం పొడిబారకుండా కాపాడటమే కాకుండా మొటిమలు వంటి సమస్యలను నివారిస్తుంది.

చాక్లెట్లు, చీజ్, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ అల్పాహారానికి ముందు అస్సలు తీసుకోకూడదు. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వకపోగా కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. ఇక చాలామంది పండ్ల రసాలు తాగడం ఆరోగ్యకరం అని భావిస్తారు, కానీ పండ్లను నేరుగా తింటేనే పూర్తి పోషకాలు అందుతాయి. పండ్ల రసాల్లో చక్కెర కలపడం వల్ల అవి డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి, ఇన్సులిన్ సమస్యలను ప్రేరేపించి రోజంతా మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి. కాబట్టి ఉదయం పూట సరైన ఆహార ఎంపికలతో మీ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.

Follow Us