మసాలా లేకుండా టమాటా ఎండు చేపల కూర.. ఇలా వండితే ముక్క కూడా మిగలదు!

Samatha

31 march 2026

ఎండు చేపల కర్రీ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది చాలా ఇష్టంగా ఎండు చేపల కర్రీ వండుకొని తింటారు.

టమాటా, ఎండు చేపల కర్రీ

అయితే ఈ ఎండు చేపల కూరలో టమాటాలు వేసి వండుకుంటే, ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం టమాటా ఎండు చేపల కూర ఎలా వండాలో చూద్దాం.

టేస్ట్

కావాల్సిన పదార్థాలు : టమాటాలు, ఎండు చేపలు, ఉల్లిపాయ ముక్కలు తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మెంతి ఆకు, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె,ఆవాలు, జీలకర్ర,పుసుపు.

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం : ముందుగా ఎండు చేపలను తీసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత వాటిని మరిగే నీటిలో వేసి, తీసి మరో బౌల్‌లో వేసుకోవాలి.

తయారీ విధానం

తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

వేయించడం

ఇవి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఎండు చేపలు వేసి మంచిగా వేయించుకోవాలి.

ఎండు చేపలు వేయడం

తర్వాత టమాటాలు వేసి మంచిగా వేయించుకోవాలి. కొన్ని వాటర్ పోసి, ఇన్నీ మంచిగా ఉడికేలా చూడాలి. తర్వాత కారం , ఉప్పు వేసి మరో ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టాలి.

ఉడకబెట్టుకోవడం

ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర, మెంతి ఆకు వేసి, మరో పదినిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మాసాలా లేకుండా టమాటా ఎండు చేపల కర్రీ రెడీ

కర్రీ రెడీ