AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో నాన్‌వెజ్ తింటే బాడీలో ఇంత జరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

సాధారణంగా చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఎండలు మండిపోతున్న ఈ వేసవి కాలంలో మాంసాహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసం అధికంగా మాంసం తింటే అది మీ జీర్ణవ్యవస్థపైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ ఎండల్లో మాంసాహారానికి ఎందుకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

ఎండాకాలంలో నాన్‌వెజ్ తింటే బాడీలో ఇంత జరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..
Why You Should Avoid Non Veg In Summer
Krishna S
|

Updated on: Mar 31, 2026 | 9:39 PM

Share

ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం పది దాటితేనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఉక్కపోత సమయంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అయితే చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. వేడిని తట్టుకోవడానికి ఒకవైపు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూనే, మరోవైపు మసాలాలు దట్టించిన చికెన్, మటన్ వంటి మాంసాహారాలను లాగించేస్తుంటారు. కానీ వేసవిలో మాంసాహారం అతిగా తినడం వల్ల మీరు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసంలో ఉండే అధిక ప్రోటీన్లు మన శరీర జీవక్రియపై అదనపు భారాన్ని పెంచుతాయి. దీనివల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి, గుండెపోటు నుండి జీర్ణకోశ వ్యాధుల వరకు అనేక ముప్పులు పొంచి ఉన్నాయి.

ఎండల్లో మాంసాహారం ఎందుకు వద్దు?:

శరీరంలో ఉష్ణోత్పత్తి

మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవిలో ఇప్పటికే బయట వేడి ఎక్కువగా ఉండటం వల్ల మాంసం తింటే శరీరం మరింత వేడెక్కి తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది.

డీహైడ్రేషన్

మాంసంలోని అధిక ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. దీనివల్ల శరీరంలోని నీటి నిల్వలు త్వరగా ఖర్చయిపోయి, మీరు నిర్జలీకరణానికి గురయ్యే ప్రమాదం ఉంది.

మందగించే జీర్ణక్రియ

వేసవిలో మన శరీర జీవక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది. ఇటువంటి సమయంలో భారీ మాంసాహార భోజనాన్ని జీర్ణం చేసుకోవడం కడుపుకు పెద్ద భారమవుతుంది. ఫలితంగా ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

త్వరగా పాడయ్యే ప్రమాదం

అధిక ఉష్ణోగ్రతల వల్ల మాంసం చాలా త్వరగా బ్యాక్టీరియా బారిన పడి పాడవుతుంది. సరిగ్గా నిల్వ చేయని లేదా సరిగ్గా ఉడకని మాంసం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు వంటి ఆహార సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

గుండె – క్యాన్సర్ ముప్పు

ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది ధమనుల్లో పేరుకుపోయి రక్తపోటును పెంచుతుంది. అలాగే, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వేసవి నెలల్లో మాంసాహారాన్ని వీలైనంత మితంగా తీసుకోవడం ఉత్తమం. దానికి బదులుగా ఈ కాలంలో లభించే తాజా పండ్లు, కూరగాయలు, మజ్జిగ, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం తేమగా తేలికగా ఉంటుంది.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా