AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేస్ట్‌ కోసం టెంప్ట్ కావద్దు బ్రో.. సమ్మర్‌‌లో ఇవి తింటే డీహైడ్రేషన్ ముప్పు..!

వేసవి కాలం వచ్చిందంటే చాలు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని అందరూ చెబుతుంటారు. అయితే మనం రోజూ తినే కొన్ని రకాల భారతీయ వంటకాలు మనకు తెలియకుండానే శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించి డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయని మీకు తెలుసా?

టేస్ట్‌ కోసం టెంప్ట్ కావద్దు బ్రో.. సమ్మర్‌‌లో ఇవి తింటే డీహైడ్రేషన్ ముప్పు..!
Popular Indian Foods That Secretly Dehydrate You This Summer.jpg
Nikhil
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 12:37 PM

Share

రుచి కోసం మనం ఆశగా తినే పచ్చళ్లు, మసాలా దట్టించిన వంటకాలు ఎండల సమయంలో శరీరానికి హాని చేయవచ్చు. వేసవిలో అలసట, నీరసం రాకుండా ఉండాలంటే మనం దూరంగా ఉండాల్సిన ఆ ఎనిమిది రకాల ఆహార పదార్థాల గురించి వివరంగా తెలుసుకుందాం.

భారతీయ భోజనంలో పచ్చళ్లు లేనిదే ముద్ద దిగదు, కానీ వీటిలో ఉండే సోడియం కంటెంట్ శరీరంలో నీటిని నిల్వ ఉంచేలా చేసి తరచుగా మూత్ర విసర్జనకు దారితీస్తుంది. దీనివల్ల అంతర్గతంగా నీటి నష్టం జరిగి వేసవిలో త్వరగా అలసిపోయేలా చేస్తుంది. అలాగే కారం ఎక్కువగా ఉండే మసాలా కూరలు శరీర ఉష్ణోగ్రతను పెంచి విపరీతంగా చెమట పట్టేలా చేస్తాయి. దీనివల్ల శరీరంలోని ద్రవాలు వేగంగా హరించుకుపోతాయి.

సమతుల్యతకు దెబ్బ..

డీప్ ఫ్రై చేసిన స్నాక్స్, చాట్స్ లో నూనె, ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను దెబ్బతీస్తాయి. మసాలా పాపడ్, ప్యాక్ చేసిన నమ్ కీన్స్ లో కూడా ప్రిజర్వేటివ్స్, ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించి విపరీతమైన దాహాన్ని కలిగిస్తాయి. ఇవి తిన్నప్పుడు వెంటనే శక్తి వచ్చినట్లు అనిపించినా, కొద్దిసేపటికే డీహైడ్రేషన్ వల్ల నీరసం వచ్చే ప్రమాదం ఉంది.

చాలామంది ఎండలో కూడా వేడివేడిగా ఛాయ్ లేదా కోల్డ్ కాఫీ వంటి కెఫీన్ పానీయాలు తాగుతుంటారు. కెఫీన్ మూత్ర విసర్జనను పెంచి శరీరంలోని ద్రవాలను బయటకు పంపిస్తుంది. ఇక భారీగా మసాలాలు, నూనె వేసి వండిన నాన్ వెజ్ వంటకాలు కూడా వేసవిలో మంచివి కావు. ఇవి శరీరంలో వేడిని పుట్టించి దాహాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ ఎండల సమయంలో వీలైనంత వరకు చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ, ఈ ఎనిమిది రకాల ఆహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అప్పుడే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.

Follow Us