AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై అడ్డంగా బుక్కయిన ఇంగ్లండ్ క్రికెటర్.. కట్ చేస్తే.. భారీ జరిమానా విధించిన కోర్ట్..!

Delhi Capitals Ben Duckett News: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 2026 నుంచి అర్ధాంతరంగా తప్పుకుని విమర్శలు ఎదుర్కొంటున్న డకెట్, తాజాగా తన దేశంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి అడ్డంగా దొరికిపోయాడు. అతివేగంగా కారు నడిపినందుకు బ్రిటీష్ కోర్టు అతనికి సుమారు రూ. 1.37 లక్షల భారీ జరిమానా విధించింది.

నడిరోడ్డుపై అడ్డంగా బుక్కయిన ఇంగ్లండ్ క్రికెటర్.. కట్ చేస్తే.. భారీ జరిమానా విధించిన కోర్ట్..!
Ben Ducket
Venkata Chari
|

Updated on: Mar 31, 2026 | 9:42 PM

Share

Delhi Capitals Ben Duckett News: బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం, ఇంగ్లండ్‌లోని స్టాఫోర్డ్‌షైర్ ప్రాంతంలో బెన్ డకెట్ తన ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీ (Land Rover SUV) కారులో మితిమీరిన వేగంతో ప్రయాణించాడు. ఆ రోడ్డుపై గరిష్ట వేగ పరిమితి గంటకు 70 మైళ్లు (సుమారు 112 కి.మీ.) ఉండగా, డకెట్ ఏకంగా 93 మైళ్ల (సుమారు 150 కి.మీ.) వేగంతో దూసుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి.

గత ఏడాది ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు, తాజాగా తీర్పు వెలువరించింది. డకెట్ తన తప్పును అంగీకరించడంతో కోర్టు అతనికి 700 పౌండ్ల జరిమానాతో పాటు ఇతర ఖర్చుల నిమిత్తం మరో 400 పౌండ్లు కలిపి మొత్తం 1100 పౌండ్లు (రూ. 1.37 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, అతని డ్రైవింగ్ లైసెన్స్‌కు 4 పెనాల్టీ పాయింట్లను కూడా జోడించింది.

వివాదాల బెన్ డకెట్: గతంలోనూ ఇదే తీరు..

బెన్ డకెట్ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు.

మద్యం మత్తులో డ్రైవింగ్: 2015లో డకెట్ తాగి కారు నడిపిన కేసులో దొరికిపోయాడు. అప్పట్లో కోర్టు అతనిపై 12 నెలల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించింది.

యాషెస్ సిరీస్‌లో రభస: గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు యాషెస్ సిరీస్ మధ్యలో మద్యం మత్తులో దొరికిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమణ: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు డకెట్ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌కు అమ్ముడైన ఆయన, టెస్ట్ కెరీర్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాకు చెప్పడం గమనార్హం.

కెరీర్‌పై పడుతున్న నీలినీడలు..

వరుస వివాదాలు, క్రమశిక్షణారాహిత్యం బెన్ డకెట్ అంతర్జాతీయ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు ప్రతిభావంతుడైన ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా, మైదానం బయట అతని ప్రవర్తన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును (ECB) ఇరకాటంలో పడేస్తోంది. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఉంటూ పదేపదే ఇలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడటంపై అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనైనా తన ప్రవర్తన మార్చుకోకపోతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us