AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో జోరున వర్షాలు.. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు.. తాజా వెదర్ రిపోర్ట్

తెలంగాణలో మండుతున్నాయి ఎండలు. ఇవాళ్టి నుంచి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే 8 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణ తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: తెలంగాణలో జోరున వర్షాలు.. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు.. తాజా వెదర్ రిపోర్ట్
Rains
Ravi Kiran
|

Updated on: Apr 16, 2025 | 7:42 PM

Share

తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు దక్షిణ మధ్యప్రదేశ్.. దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్ వద్ద కేంద్రీకృతమైన ఉపరితల చక్రవాతపు ఆవర్తనం నుంచి మరాత్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరొక ద్రోణి కొనసాగుతోంది.

బుధు, గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గురువారం గరిష్టంగా మెదక్ లో 41.9 డిగ్రీలు, కనిష్టంగా భద్రాచలంలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గురువారం ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే పై 8 జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ ఉందట. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి 

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు