AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ జ్యూరీ చైర్‌పర్సన్‌గా జయసుధ.. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు

గద్దర్ అవార్డ్స్ పై స్పీడ్‌ పెంచింది ఎఫ్‌డీసీ. జ్యూరీ చైర్‌పర్సన్‌గా జయసుధను ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఓ సారి లుక్కేయండి.. ఆ వివరాలు

Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ జ్యూరీ చైర్‌పర్సన్‌గా జయసుధ.. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు
Jaya Sudha
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 16, 2025 | 10:00 PM

హైదరాబాద్‌ ఎఫ్‌డీసీ సమావేశ మందిరంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు , జ్యూరీ ఛైర్మన్ సినీనటి జయసుధ అధ్యక్షతన తొలిసారి గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. సినీ నటి జయసుధ ఛైర్మన్ గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరిని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఈసమావేశంలో తెలిపారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎస్. హరీష్. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్ గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు జయసుధ. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు దిల్‌రాజు. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్ ను ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదన్నారు దిల్‌రాజు.

ఇక గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీ లకు కలిపి 12వందల 48 నామినేషన్లు అందినట్లు దిల్‌ రాజు తెలిపారు. ఈ నెల 21 వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ గద్దర్ అవార్డలకు వివిధ క్యాటగిరిల ఎంట్రీ ల నుంచి వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత క్యాటగిరి లో 11వందల 72, ఫీచర్‌ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ లేదా లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యురీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు కోరారు.