AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లపై మరో బిగ్ అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే కేటాయింపు..

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 10వ తేదీలో దరఖాస్తులకు గడువు ముగియనుంది. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అయితే లాటరీ పద్దతిలోనే ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 20న లాటరీ చేపట్టనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లపై మరో బిగ్ అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే కేటాయింపు..
Indiramma House
Venkatrao Lella
|

Updated on: Aug 09, 2026 | 12:40 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 10వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియనుంది. మరో ఒక్కరోజే గడువు ఉండటంతో చివరి నిమిషంలో దరఖాస్తులు ఎక్కువగా వన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను ఎలా కేటాయించాలనే దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అదే లాటరీ విధానం. దరఖాస్తుల పరిశీలన, అర్హతలను నిర్దారించిన అనంతరం లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత లాటరీ ప్రక్రియ చేపట్టి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను అధికారుల రూపొందించారు.

ఈ నెల 20వ తేదీన లాటరీ ప్రక్రియ

ఈ నెల 20వ తేదీన లాటరీ ప్రక్రియ చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేవలం అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు పారదర్శకంగా చేపట్టేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో తొలి విడతలో 7,340 ఇళ్లను కేటాయించనున్నారు. వీటి కోసం శనివారం వరకు 35,125 దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మ్ వి.పి గౌతమ్ ప్రకటించారు. ఆగస్ట్ 10 వరకు సమయం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇళ్లను కేటాయించిన తర్వాత ఏడాదిలోగా పూర్తి చేసిన లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇళ్లు మంజూరు కానివారికి దరఖాస్తు ఫీజు కింద వసూలు చేసిన రూ.10 వేలు రీఫండ్ చేయనున్నారు.

నియోజకవర్గాల వారీగా దరఖాస్తు వివరాలు

కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 5233 దరఖాస్తులు రాగా.. ఖైరతాబాద్ నుంచి 4394, కుత్బుల్లాపూర్ నుంచి 4121, నాంపల్లి నుంచి 3613, మలక్ పేట నుంచి 2846, శేరిలింగంపల్లి నుంచి 2530, అంబర్‌పేట నుంచి 2357, కార్వాన్ నుంచి 1574, రాజేంద్రనగర్ నుంచి 1496, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 1374, మేడ్చల్ నుంచి 1153, బహదూర్ పుర నుంచి 1135, సనత్ నగర్ నుంచి 1046, మల్కా్జ్ గిరి నుంచి 1033 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో మంజూరు చేయనున్న ఇళ్ల కంటే దరఖాస్తుల సంఖ్య నాలుగున్నర రేట్లు ఎక్కువగా ఉంది. దీంతో లాటరీ ద్వారా ఎవరికి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. సందేహాల కోసం 040-24603572 నెంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్‌లో మొత్తం లక్ష మందికి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే గుర్తించారు. ఈ స్థలాల్లో భవన సముదాయాలను నిర్మించి లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

Follow Us