Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్ టెన్షన్.. ఆ 28 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?

కొంతమంది లీడర్లు ఎన్నికల సమయంలో సరైన ఆస్తులు, సరైన కేసుల వివరాలను సమర్పించని కారణంగా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని అఫిడవిట్ ఆధారం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి జలగం వెంకట్రావుని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ స్టే నివ్వడంతో మళ్లీ వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా..

Telangana Elections: బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్ టెన్షన్.. ఆ 28 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?
Telangana Assembly
Follow us
Vijay Saatha

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 24, 2023 | 7:36 PM

మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ అధికార పార్టీ నేతలని ఎలక్షన్ పిటిషన్లు కలవరపెడుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పైన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు తర్వాత పిటిషన్లు ఎదుర్కొంటున్న నేతల్లో టెన్షన్ నెలకొంది. దాదాపు 28 ఎలక్షన్ పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఆగష్టు ఎండింగ్ లోపు ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్ పిటిషన్‌లపై జడ్జిమెంట్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లీడర్లు అంతా టెన్షన్ గురవుతున్నారు.

గద్వాల ఎమ్మెల్యే పై అనర్హత వేటు!

గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పై పడ్డ అనర్హత వేటు తర్వాత చాలామంది లీడర్లు తమ ఎమ్మెల్యే పదవికి ఏమవుతుంది అన్న టెన్షన్‌లో ఉన్నారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో జరిగిన వివిధ కారణాలు, ఎన్నికల్లో జరిగిన గొడవలు, ఓట్ల లెక్కింపులో జరిగిన వ్యత్యాసాలపై దాదాపు 28 మందికి పైగా ప్రజాప్రతినిధులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అయిన తర్వాత చాలా చోట్ల జరిగిన గొడవలు, ఓట్ల లెక్కింపు కావచ్చు, ఓట్ల లెక్కింపు సంబంధించి అవకతవకల పైన విచారణ జరిపించాలని చాలామంది కోర్టును ఆశ్రయించారు.

ఎన్నికల అఫిడవిట్లలో తప్పులున్నాయంటూ పిటిషన్లు..

కొంతమంది లీడర్లు ఎన్నికల సమయంలో సరైన ఆస్తులు, సరైన కేసుల వివరాలను సమర్పించని కారణంగా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని అఫిడవిట్ ఆధారం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి జలగం వెంకట్రావుని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ స్టే నివ్వడంతో మళ్లీ వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ఎదుర్కొంటున్న, పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల వారిగా గమనిస్తే మంచిర్యాల, హుస్నాబాద్, గద్వాల్, మహబూబ్‌నగర్, దేవరకొండ, అసిఫాబాద్, పటాన్‌చెరు, ఖైరతాబాద్, వేములవాడ, సికింద్రాబాద్, కొడంగల్, ఇబ్రహీంపట్నం, మహబూబ్‌నగర్, వరంగల్ ఈస్ట్, ఆలేరు, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ధర్మపురి, కోదాడ, నాగర్ కర్నూల్, గోషామహల్, వికారాబాద్, గజ్వేల్, పరిగి, జనగాం, కరీంనగర్, నాంపల్లి, కొత్తగూడెం సహా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

ఆగష్టులో ముగిసేలోపు తేలనున్న నేతల భవితవ్యం..

ఆగష్టు నెల చివరిలోపు ఎలక్షన్ పిటిషన్లను పూర్తిస్థాయిలో ఆర్డర్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ 30 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలో టెన్షన్ నెలకొంది. మరొక 6 నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి ఆర్డర్ వస్తుందో అనే టెన్షన్ ప్రజా ప్రతినిధులు నెలకొంది.

గద్వాల ఎమ్మెల్యేగా జేజమ్మ..

గద్వాల్ జేజమ్మగా పోయిన డీకే అరుణ తెలంగాణ హైకోర్టు అనూహ్య నిర్ణయంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లి కృష్ణమోహన్ రెడ్డి చేయి తెచ్చుకుంటారా అన్నదానికైనా కొన్ని రోజులు క్లారిటీ రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..