Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మాటలకందని విషాదం.. కోతిని కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయిన రైతు..

ట్రాన్స్‌ఫార్మర్‌లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కోతిని కాపాడే ప్రయత్నంలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు మృతితో ఆయన కుటుంబం సహా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో తిరుగుతున్న కోతి.. ఆహారం కోసం వెతుకుతూ ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కింది. ఆ సమయంలో పొరపాటు జారి ట్రాన్స్‌ఫార్మర్ మధ్యలో ఇరుక్కుపోయింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.

Telangana: మాటలకందని విషాదం.. కోతిని కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయిన రైతు..
Farmer Died While Saving Monkey
Follow us
G Sampath Kumar

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 18, 2023 | 12:01 PM

ట్రాన్స్‌ఫార్మర్‌లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కోతిని కాపాడే ప్రయత్నంలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు మృతితో ఆయన కుటుంబం సహా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో తిరుగుతున్న కోతి.. ఆహారం కోసం వెతుకుతూ ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కింది. ఆ సమయంలో పొరపాటు జారి ట్రాన్స్‌ఫార్మర్ మధ్యలో ఇరుక్కుపోయింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. అదే సమయంలో అటుగా వచ్చిన రైతు సంతోష్.. దానిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ ప్రయత్నంలో అతనే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి కరెంట్ షాక్ తగలడంతో స్పాట్‌లో చనిపోయాడు సంతోష్.

కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ముకుంద సంతోష్ అనే రైతు ఇంటి పక్కనే ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కుని ఓ కోతి ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. కోతిని తీసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ గురై మృతి చెందాడు. దీంతో అతని కుటుంబం విషాదంలో మునిగి పోయింది. సంతోష్.. కోతిని కర్ర సహాయంతో తీసే ప్రయత్నం చేశాడు. కానీ.. బయటకు రాలేదు. కోతి మరింత అస్వస్థతకు గురింది. అది చూసి ఆ రైతు గుండె తళ్లడిల్లిపోయింది. కానీ.. కోతి బయటకు రాలేకపోయింది. కొంత మంది వద్దని చెప్పినా వినలేదు. ఇక లాభం లేదనుకొని.. ట్రాన్స్ ఫార్మర్ బంద్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే, భారీ వర్షాలు కురియడంతో.. ఇంకా నీటి పదను అలాగే ఉంది. దీనిని ఆ రైతు గమనించలేకపోయాడు. లాక్ క్లోజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలానే.. విద్యుత్ షాక్ వచ్చింది. హై వోల్టెజ్ కావడంతో రైతు సంతోష్ అక్కడే కుప్పకూలిపోయాడు. సంఘటనా స్థలంలోనే రైతు చనిపోయాడు.

కోతి కూడా చనిపోయింది. మూగ జీవిని కాపాడే ప్రయత్నంలో రైతు విగత జీవిగా మారాడు. ఇటీవల గ్రామాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. తరుచు ప్రమాదాలతో చనిపోతున్నాయి. ఈ గ్రామంలో కూడా కోతుల సంఖ్య అధికంగా ఉంది. విద్యుత్ షాక్‌తో చనిపోయిన.. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..