AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులు జాగ్రత్త.. విదేశాల్లో జాబ్ వచ్చిందని వెళ్తే..

తెలంగాణ నిరుద్యోగులకు వలవేస్తున్నాయి చైనీస్ కంపెనీలు.. విదేశాల్లో మంచి ఉద్యోగం ఆకర్షించే జీతం అంటూ ఫేక్ ఆఫర్లు సృష్టించి తెలంగాణ యువతను విదేశాలకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత యువకులకు వివిధ టాస్కులు ఇచ్చి సైబర్ నేరాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారు. బలవంతంగా సైబర్ నేరాలు చేయమని యువకులకు ఒత్తిడి తెస్తూ టార్చర్ చేస్తున్నారు.

Telangana: నిరుద్యోగులు జాగ్రత్త.. విదేశాల్లో జాబ్ వచ్చిందని వెళ్తే..
Job Fraud
Vijay Saatha
| Edited By: |

Updated on: Oct 26, 2024 | 10:38 AM

Share

జగిత్యాల నుండి నలుగురు యువకులు లోకల్ ఏజెంట్‌కు రెండు లక్షల రూపాయలు చెల్లించి లావుస్ దేశానికి వెళ్లారు. అక్కడ డేటా ఎంట్రీ జాబ్ అంటూ నమ్మించి యువకులను మోసం చేశారు. ఆ దేశంలో దిగిన వెంటనే వారికి ఒక చిన్నపాటి రూమ్ కేటాయించి సైబర్ నేరాలకు పాల్పడేలా రెండు నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే బలవంతంగా ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేయించి ఎన్నారైలను ట్రాప్ చేయమని టాస్క్ ఇచ్చారు. ఒకవేళ వారు ఇచ్చిన పని చేయకుంటే యువకులను హింసించేవారు. రోజుకు 18 గంటల చొప్పున యువకులతో పని చేయించుకుని నానారకాల ఇబ్బందులు పెట్టేవారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చైనీస్‌కు చెందిన పలువురు చేస్తున్నట్లు యువకులు తెలిపారు

జగిత్యాల నుండి సెప్టెంబర్ 30న నలుగురు యువకులు ప్రవీణ్, మహేష్, అఖిల్, మోహన్ కలిసి ఏజెంట్‌కు డబ్బులు చెల్లించి పాస్‌పోర్ట్‌ ఇచ్చాక లావుస్ దేశానికి వెళ్లారు. ఆక్కడ జరుగుతున్న అఘాయిత్యాలను చూసి తిరిగి వచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు.ఎట్టకేలకు తెలంగాణకు యువకులు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు యువకులు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో గతంలోనూ పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ నిరుద్యోగులకు పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లావుస్, కంబోడియా, మయన్మార్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి ఎవరైనా ట్రాప్ చేస్తే వారి వివరాలు తమకు ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు

మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..