Weather Report: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..
Weahter Forecast: తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు
Weahter Forecast: తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ తరుణంలో వర్షాలు కురుస్తుండటంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. మంగళవారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వర్షం కురిసింది. దీంతోపాటు బుధవారం, గురువారం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిమీ. నుంచి 1.5కిమీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉందని హైదరాబాద్, విజయవాడ వాతావరణ కేంద్రాలు మంగళవారం వెల్లడించాయి. ఈ రోజు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
దీని కారణంగా రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. దీంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖలు హెచ్చరించాయి. ఈ ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల అక్కడక్కడ సాధారణం కంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
నిన్న తెలంగాణలో అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో 34.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, తదితర ప్రాంతాలల్లో కూడా వర్షం కురిసింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో అత్యధికంగా పిడుగులు ప్రమాదం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటీవలనే తెలంగాణ, ఏపీలల్లో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ అకాల వర్షాల వల్ల వరి, మిర్చి పంటలు నాశనమయ్యాయి. దీంతోపాటు పిడుగుపాటు ఘటనలతో చాలామంది మరణించారు.
Also Read: