Telangana Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో మొదలైన వానలు..రెండు రాష్ట్రాల్లోనూ ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ అంతటా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ

Telangana Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Jul 18, 2023 | 9:53 AM

Hyderabad, July 18: ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో మొదలైన వానలు..రెండు రాష్ట్రాల్లోనూ ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ అంతటా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురవనున్నాయి. అయితే, ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరతిల ఆవర్తనం ఏర్పడనుందని, రేపు అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.

వాయువ్య బంగాళాఖాతంలో, దాన్ని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, కామారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మంగళవారం నాడు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా.. బుధవారం నాడు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం నాడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక హైదరబాద్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 28° నుండి 23°గా ఉంటాయని తెలిపారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టా, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, కొండాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో ఆగకుండా వర్షం కురుస్తోంది. ఇక ఈ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే వర్షం నీరు నిలిచిపోయింది.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు